పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/671

ఈ పుట ఆమోదించబడ్డది

అంతా రామమయం

775

(1) ఎందఱో మహానుభావు లందఱికి వందనములు.

(2) తెలివి యొకరిసొమ్మా యెందుకే విభుని తిరుగ పొమ్మంటినమ్మా

(3) అలిగితే భాగ్యమాయె మటేమీ వాడలిగితే
     తలిరుబోఁడిరొ? వాని దండించఁగలనా? వా||డలిగితే||

యెక్కఁడేనావొకపదం తత్సమంపడినా అదికూడా తెలుక్కంటే కూడా సులభంగా అర్థమయేదే పడుతుంది పదకవిత్వంలో; అయితే పదకవులు ఆయీభాషావిభాగాన్ని ప్రయత్నపూర్వకంగా చేసి వాడివుంటారా? అంటే? వినండి నాఅనుభవాన్ని వివరిస్తాను. దైవాత్తూ వారి కాయీమాటలు దొర్లుతాయి కాని వారు దీనికి ప్రయత్నించరు.

చ. కనుఁగవ కింపు గల్గి తగు కామకలాభ్యసనంబు గల్గి జ
    వ్వనమున లేఁత యయ్యు రసభావములన్ గడుఁ బెద్దయై తనం
    తన వలపున్నదైన వనితామణి యెవ్వని కబ్బుఁ బ్రాగ్భవం
    బునఁ దులలేని పున్నెములు పూవులుపూచి ఫలింపకుండినన్.

ఆయీ పద్యంలో అయిదు పదాలు సంస్కృత మనుకోవడానికి తగ్గగురుతుకల వున్నాయి. ఆఱోపదం తెలుఁగులోకలిసి పోయినమాదిరిదే. దీన్ని యీవిధంగా చెపితే బాగుంటుందని కవి అనుకొని రచించి వుంటాఁడనుకోవడం శుద్ధ పొరఁబాటు. కాంతలకు హావభావాదు లెట్టివో? కవుల కాయాయీ రచనావిశేషాలున్నూ (లీలావతీనాం సహజా విలాసాః భర్తృహరి చూ.) అట్టివే. విలాసాలే లేనిస్త్రీలున్నూ వుంటారు. రచనావిశేషాలు దొరలని కవులూ వుంటారు. ఇంతేకాదు, ఆయినా రహస్యాలు కనిపెట్టడం చేతగాని వ్యాఖ్యాతలున్నూ వుంటారు. (నాకు అన్నిరాగాలూ వొకటేలాగు వుంటాయి. అన్ని అత్తరువులూ కూడా డిటో అనే వారున్నూ కలరు.) తత్సమపదభూయిష్టంగా కవిత్వంచెప్పి ఆంధ్రకవికుల గురుత్వాన్ని కైకొన్న నన్నయ్యకవిత్వంలో కూడా యీపోకళ్లు వున్నాయి.

క. దేవసములైన యనుజుల
   తో విప్రులతో రథాళితో వచ్చి యర
   ణ్యావాసము సేసెదు ధర
   ణీవల్లభ? నీవు ధర్మనిష్ఠితబుద్ధిన్.

యీపద్యంలో మూఁడుపదాలు మాత్రం తెలుఁగు వున్నాయి. తక్కిన యావత్తూ సంస్కృతమే అయినప్పటికీ వినేటప్పటికల్లా అర్థం గోచరిస్తూ వుండడంచేత దీన్ని జాను తెలుఁగు కింద జమకట్టినా వొప్పుతుంది. పదకవుల కవిత్వం యావత్తూ యీలాగే