పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈతి బాధలు

71


యెఱిఁగి వుండడంచేత కాఁబోలు! వృథాగా యీ హింసారూపమైన పాపాన్ని ΟΟΟΟ మహారాజు చేస్తూవుంటే చూస్తూ వూరుకోవడమెందుకని “ఓం శాంతి శాంతి శాంతిః" చెపుతూ వచ్చారు. చాలా దయాశాలిగావుండే శ్రీనూజివీటి రామచంద్రప్పారావుగారు వక రోజున ప్రసంగవశాత్తూ అహింసాతత్త్వాన్ని గూర్చి మాట్లాడుతూ అన్నారు గదా! మాంసభక్షణం హింసామూలక మవడంచేత పూర్తిగా వర్ణించతగ్గదే కాని ఆ పద్ధతిని యీ జంతువులు అందులో చతుష్పాత్తులలో మేంకలూ గొట్టెలూ ద్విపాత్తులలో అందులో పక్షులలో ముఖ్యంగా కోళ్లు, యివి యేమికావలసి వుంటుందో? బోధకురాదన్నారు. సూలదృష్టిని చూస్తే ఆలాగే కనపడుతుంది. రోజువకంటికి ఆ సేతుహిమాచల పర్యంతంలో తెగుతూవున్న మేంకలూ గొట్టెలూ కోట్ల సంఖ్యకు మించుతాయనడంలో అతిశయోక్తిలవమున్నూ వుండదు గదా? కోడిగుడ్లను లెక్కపెట్టడం భూరేణువులని లెక్కించడంవంటిదే. యిలా మనుష్యులకోసం యివి హతమాఱుతూ వున్న మూలచ్ఛేదం కాక సముద్రంలో తరంగాలలాగ మామూలు వృద్ధిలోనే వుండడంచూస్తే వీట్లని గుణించిన భగవదుద్దేశమేలాటిదో బొత్తిగా మనస్సుకు అందడమేలేదు. యిన్ని జీవరాసులను యీలా చంపుకుతింటూవున్న మాంసభక్షకులను యెవళ్లుగాని నిందించినట్టే కనపడదుగాని వేదవిహితమైనకర్మలు చెడిపోతాయనే భయంతోటి యజ్ఞంలో పరిమితంగా ఆలభనంచేసే మేంకలను గూర్చి చింతించేవారు పలువురు కనపడతారు. యజ్ఞానికి ఆనల్లమేంకనో తెల్లమేంకనో కర్మపరులు తీసుకోవడంమానినంతలో దానికి బలవన్మృతి తప్పతుందేమో అంటే? ‘తిరుమలతాతాచార్లగారిముద్ర" లాగఏలాగాతప్పదు. ఈవేళ సోమయాజులుగారి గండం తప్పినా మఱునాఁటి బిస్మిల్లామంత్ర పాఠకుల గండంతప్పుతుందా? అయితే వకటిమాత్రంవుంది. అహింసాపరులమనిన్నీ భూతదయాపరులమనిన్నీ చెపుతూవుండేవారిని యెవరేనా యేమేనా అనడానికి అవకాశంవుంటుందిగాని యితరులని యెవరేమంటారు? అంతేనే కాని వీరియందు వుండే ద్వేషభావంచేత కాదని విస్పష్టమే. పూర్వకాలంలో జంతుహింసలేదని చెప్పఁజాలంగాని యిప్పటిమాదిరిగా తదర్థమై శాలా నిర్మాణాలు వున్నట్టు గ్రంథదృష్టాంతాలు కనపడవు. భారతంలో ధర్మ వ్యాధుండు చెప్పినమాటలుకూడా యీ వూహనే బలపఱుస్తాయి. మహమ్మదీయ ప్రభుత్వం వచ్చాకైనా శాలానిర్మాణపద్ధతి వున్నట్టుతోచందు. కాని పూర్వంకంటే హింస కొంతతీవ్రరూపం తాల్చిందంటే వొప్పనివారుండరు. ఆ రాజ్యంలోనే గోవధ బాగా విస్తరించివుంటుంది. సందేహములేదు. అంతకు పూర్వం నరమేధంతోపాటుగా బహువిరళంగా గోమేధాలు కూడా వుంటే వుండేవేమోకాని మహమ్మదీయులు గోమేధాలు అజామేధాలతోపాటుగానే సాగించారు. యిటీవల వీట్లకోసమంటూ శాలానిర్మాణాలు కూడా యూరోపియను ప్రభుత్వంలో అయాయి. ఆమధ్య నూజివీటిలో కాంబోలును పందులను చంపడానికంటూ యూనియన్ బోర్డువారు శాలా నిర్మాణానికి ప్రారంభిస్తారని తెలిసి