పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/640

ఈ పుట ఆమోదించబడ్డది

744

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


శుష్కకాయుల తరగతిలో చేర్చడానికి వాని దేహప్రకృతి వొప్పుకోదు. లంబోదరత్వం ఆయాసపుదగ్గువాళ్లకు మఱింత బాధకం. నాపద్యంలో తగ్గు దగ్గు, వలెనే యితనికి యిడుమలూ కుడుములూ కొంతవుపకరించాయి. మాగోదావరీతీరంలో కుడుములు కల్పించడంకంటే యిడుమలు కల్పించడమే మంగళంగాభావిస్తారు. కుడుములు చాలా అమంగళ ప్పిండివంటల్లో చేరుతుంది. విఘ్నేశ్వరుఁడికి చవితినాడు నివేదించేవాట్లను మా తీరస్థులు వుండ్రాళ్లంటారుకాని కుడుము లనరు. శాంతం పాపం. యిడుమలు బాధకములైనను “జీవన్ భద్రాణి పశ్యతి" కదా? ఆయీసంప్రదాయాలు మండలభేదానికి సంబంధించినవి. యిఁక యీ విచారణవద్దు. యీ పద్యంలోకూడా చాలా మంచికవిత్వం వుంది. యింకోపద్యం కూడా వుదాహరించి విరమిస్తాను.

మ. నరజన్మం బెటు లిచ్చితో పశుపతీ; నాకంటెఁబశ్వాదులున్
     మెఱుఁగే యెన్నివిధాలఁ జూచినను; స్వామీ! ముందు చేజాఱు నీ
     పొరఁబాటున్ సవరించుకోనయిన సద్బుద్ధిన్ బ్రసాదింప వి
     తైఱఁగౌ పాలన యిందె కాని మఱి యెందే నున్నె మృత్యుంజయా.

యీ పద్యం లోగడ వుదాహరించిన పద్యాలన్నిటినీ తలదాఁటుతూ వుంది.

ఆమయపీడలో వుండికూడా పరమేశ్వరుణ్ణి నెపపెట్టి ఆయనయొడల తప్పు నిరూపించి జ్ఞానాన్ని సంపాదింపయత్నించినట్లవుతూ వుంది గాని, లేశమున్నూదైన్యాన్ని వెలిపుచ్చినట్లు తోచడంలేదు. గతించినపద్యాలు వ్యాధినిగూర్చి వ్యాకరించాయి కనక యీపద్యంలో ఆవిషయాన్ని స్పృశింపక "ప్రారబ్ధం భోగతో నశ్యేత్" అనే అభియుక్తోక్తికి వొప్పఁజెప్పి పారమార్థికానికి వుపకరించే జ్ఞానాన్నేనా అనుగ్రహించవలసిందని చాలా బెట్టుసరీగా యేదోముష్టి అంటారే ఆవిధంగా యాచించినట్లయింది. ఆలంకారికులు 'ద్విత్రాణ్యేవ' అన్న వాక్యానికి యీలాటిరచనలే వుదాహరణం అవుతాయి. తక్కినవి యతిప్రాసల కర్చేగాని కవిత్వాలనిపించుకోవు. ప్యాకేజీసరుకే విస్తరించి వుంటుందిగాని యే కాలంలోనూ కూడా యీలాటి రచన. తక్కువగానే వుంటుంది.

'యతియుం బ్రాసయుఁ గూర్చుమాత్రం గవియే?' అంతమాత్రము చేతకవి కాడనిన్నీ అది కవిత్వం కాదనిన్నీ పలుచోట్ల వ్రాసివుండడమే కాదు యితరుల రచన వుదహరిస్తే వారివారికి కోపంవస్తుందేమో అనియేదో అవధానంలో తప్పనివిధిగ రచించిన మాపద్యాన్నే "సెనగపిండి యుల్లిపాయ చిన్నిమిరపకాయలున్ జొనిపి ... ... పకోడి ... ... ఖాద్యమై” అనేదాన్ని వుదహరించి వున్నాను కూడాను. ప్రస్తుతం యెవరి కవిత్వాన్నిగూర్చి యీ నాలుగు మాటలూ వ్రాయవలసివచ్చిందో ఆ స్వయం వ్యక్తుడు మాధవపెద్ది బుచ్చి