పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/629

ఈ పుట ఆమోదించబడ్డది

యేది కవిత్వం - 2

733


రచనలో యేదో విశేషం వుందనే తాత్పర్యం వున్నట్టు ఆయన రచించిన - నిర్వచనోత్తర రామాయణం సూచిస్తూవుంది - వచనం లేకుండా శతకాలూ, అష్టకాలూ, నక్షత్రమాలలూ రచించడంలో కష్టంలేదనిన్నీ కథా సందర్భం వుండే చరిత్రలు వగయిరాలు చిత్రించడం కష్టమనిన్నీ అప్పటి కవులనుకొనేవారని తోస్తుంది. వాల్మీకిరామాయణం యావత్తూ పద్యమయమేకదా? ఆయన నిర్వచన రామాయణం అని పేరెందుకు పెట్టలేదో, విజ్ఞులు విచారింతురుగాక - ప్రయత్నం వినాగా అంటే సహజంగా దొర్లే శబ్దాలంకారాలు తప్ప యితర శబ్దాలంకారాలు కూడా శ్రమకు చేటేగాని కవిత్వానికి శోభను తేవు.

శ్లో. పరిపతతి పయోనిధౌ పతంగ
    స్పరసిరుహాముదరేషు మత్తభృంగః
    ఉపవన తరుకోటరే విహంగో
    యువతిజనేషు శనైశ్శనైరనంగః.

అప్రయత్న సిద్ధంగా దొరలడంచేత ఆ యీ శ్లోకంలో వున్న అంత్య ప్రాస హృదయంగమంగావుంది. కవిత్వం యెంతసేపూ భావప్రధానంగా వుంటేనే సంతోష జనకమవుతుందని సహృదయులు చెపుతారు. భారవి మాఖుఁడు మొదలైన మహాకవులు ఆ యీ విషయాన్ని మన్నించేవారే అయినా -

ఏకాక్షర, ద్వ్యక్షర మయాలుగా కొన్ని రచనలు సాగించడానిక్కారణం వారివారి పాండిత్య ప్రకటనార్థంగాని అన్యంకాదు. కంకణబంధంలోనైన రచనలు కేవల పాండిత్యం తెల్పడానికే. రసజ్ఞులు వాట్లని ఆమోదించరు. కాని రాజులు ఆయీ బంధకవిత్వాలకు అక్కజపడి-అగ్రహారాదులిచ్చి సమ్మానించి వున్నట్టు ప్రత్యక్ష నిదర్శనాలున్నాయి. యీసడించడం సుళువుగాని, రచన సుళువుగాదు. ఇది విషయాంతరం. తెలుఁగుకవులలో పోతరాజుగారు, సంస్కృతకవులలో త్యాగరాయాదులు ధన్యులు, వారిని స్మరించువారును ధన్యులు. -

"వయంచ కృతిన స్తత్సూక్తి సంశీలనాత్"

★ ★ ★