పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/595

ఈ పుట ఆమోదించబడ్డది

కర్ణాటకలహం

699


హృదయంలో నన్నయాదుల రచనలయందు ఆదరం లేదు. లోకాన్ని అవి రంజింపనేర వనిన్నీ యివి రంజింపఁజేస్తాయనిన్నీ వీరి విశ్వాసం. అది నేను కాదనేది లేదు. యెవరో కొందఱు ఆదరించడాన్ని బట్టే యేకొందఱో దీనిలోకి దిగి వుంటారు. దేన్నీ అందఱూ ఆదరించరు. దేన్నీ ఆదరించకపోరు. పండితరాయ లేమన్నాఁడు “యన్నింబానాం పరిణతఫల సీృతి రాస్వాదనీయా యచ్చైతేషాం కబళన కళా కోవిదః కాకలోకః" అనలేదా? రచించండి కాని, పూర్వలాక్షణికుల శ్లోకాలుదాహరించి సమర్థించడానికి పూనుకోవద్దనియ్యేవే నాఅభ్యర్ధనం. వ్రాస్తే చాలా వ్రాయాలి. యీ కర్ణాటకలహం నాకిష్టం లేకే మొట్టమొదటనే ప్రతిపక్షవాక్యానికి అంగీకారం తెల్పివున్నాను. తెల్పినా కొన్ని సాహసవాక్యాలతో మళ్లా పరాక్రమించడం శోచ్యం. పైఁగా “నీ శ్రవణానందం రసాభాసం" అంటూ యెఱిఁగీయెఱగనిమాట వొకటి వెలువడింది. (అది అటిట్ట దైతేమాత్రం యీ మాదాకవళం కవిత్వమవుతుందా?) యెందుచేత? ఆమాట యెఱిఁగీ యెఱగని దయిం దన్నప్పుడు వ్రాయందగ్గది వ్రాస్తాను. యిప్పుడెందుకు వృథా కంఠశోష? లోఁగడ యెక్కడో యీ విషయం వ్యాఖ్యానించఁబడే వుంటుందిగాని, గేయకర్తగారు అది చూచి వుండరు. లోకంలో “త్వం అంటే త్వం” అనడం సహజం. అయితే యీ మాట యీ వివాదానికి పూర్వం అంటే బాగుండేది. యిప్పుడో? “అమ్మా! మాదాకవళం" నాకు నచ్చలే దనడంచేత అన్నట్టర్ధ మవుతూవుంది. దాన్ని యీ యెఱిఁగీ యెఱగనిమాటకోసం నేను సమర్ధించేది లేదు. ("కులస్త్రీ గణికా౽థవా" చూస్తే లాక్షణిక శాసనం వున్నట్టు గోచరిస్తుంది.) నేను ఆయనపే రెత్తకుండా రచననుగూర్చే నాకు తోఁచిన మాటలు భావికవుల (నన్ను వరవడిగాఁ బెట్టుకొనేవారి) నిమిత్తం వ్రాయవలసి వ్రాశానేకాని, వ్యక్తిద్వేషాదులతో కాదు. అయినా ఆయనికి నామీఁద ఆగ్రహం కలిగింది. నిన్న మొన్నవొక పుస్తకం యెవరిదో అభిప్రాయార్థం వచ్చింది. యీ "మాదాకవళ" కవిత్వానికి యేలాటిదేనా అర్థం వుందిగాని దానికి “అర్థ మనర్థం భావయ" అన్నట్టే వుంది. మాదిరి చూపుతాను.

కరకర బిరబిర చిరచిర
కరకర బిరబిర చిరచిర

యీఅక్షరాలే కావు. మాదిరి అంతా యింతే. (యింతమట్టుకు యిది వొకఖండకావ్యం) దీనిలో బ్రహ్మాండం మునిఁగిపోయినంత విశేషార్థం వుందని యెవరో వుపాధ్యాయులు పీఠికలో వ్రాశారు. దాన్నిబట్టి బరిశీలించి చదివి చదివి విసుగెత్తింది. నాకేమీ గోచరించిందే కాదు. ఆయీ కవిత్వాలన్నిటినీ సమర్ధించడానికి ఆనందవర్ధనా చార్యులవారి లాక్షణికోక్తులుపకరిస్తాయా?