పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/594

ఈ పుట ఆమోదించబడ్డది

698

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


భారతంలో వొక సందర్భంలో “వీని బాస వేఱు" అన్నాఁడు కనక యిదిన్నీ ఆలాటిదే అని సంతోషించవలసి వుండేది. యేదో గ్రామ్యవాక్యానికి - ఆనందవర్ధనాచార్యులను రంగంలోకి దింపితే, పూర్వుల ప్రబంధలక్షణాలన్నీ “తాడుతో దబ్బనం"గా వెంటఁబడతాయని గేయకర్తగారికి తట్టలే దనుకోవాలో? లేక, వెం. శా. కి అలంకారవిషయం అచుంబితమంటే దానితో సర్వమూ సమాహిత మవుతుందని వూహించివుంటారనే అనుకోవాలో; తెలియదు. ఆనందవర్ధనాచార్యులవారి హృదయం గురుముఖతః చక్కఁగా అధ్యయనంచేసి వుండిన్నీ “అమ్మాఁ మాదాకవళం" కవిత్వమని వివదించడం అత్యాశ్చర్యం - దోషజుష్టమైన శబ్దంగాని వాక్యంగాని ఆనందులు వింటారా? చూస్తారా?

“ప్రథమకబళే మక్షికాపాతః" కదా! వారిదృష్టిలో దీనిగతి; యెందుకీ కర్ణాటకలహం, దీని కంతకూ ఫలితం నేను అలంకారశాస్త్రం చదివినవాణ్ణి అని లోకానికి తెల్పడమే అనుకోవాలి. అంతమాత్రంతో "సారస్వత వైభవం" ఆకళింపు కాదు. "శ్లో యత్సారస్వత వైభవం" చూడఁదగు వొక మహావిద్వాంసుఁడు వొకానొక రాజసభలో "కాంతాసమ్మితయా యయా" అన్నదానికి తాత్పర్యం వ్యాఖ్యానిస్తూ పలికినమాటలు సమయానికి జ్ఞప్తికివచ్చాయి. వుదాహరిస్తాను, “భార్య తన కేదేనా వస్తువు (నగ) కావలసివస్తే, విలాసాలు కనపఱుస్తుంది" అని వ్యాఖ్యానించేటప్పటికి ఆమాటలు విని మఱోపండితుఁడన్నాఁడు రాజుగారితో “అయ్యా! రాజా! మీవంటి మహారాజులకు తెల్లవార్లూ విలాసాలు చూపిస్తే పగలంతా మీరు సమర్థులు కనక ఆభరణాలు చేయిస్తా రనుకుందాం, యిఁక మాబోఁటివాళ్లగతి యేమిటి?” అనిప్రశ్నించేటప్పటికి రాజుగారూ నిర్ఘాంతపోయారు. పండితుఁడూ నిర్ఘాంతపోయాఁడు. (పాఠప్రతిష్ఠాజుట్టులకు యెవ్వరికోగాని అనుభూతి వుండదు) చెప్పొచ్చేదేమిటంటే? అలంకారశాస్త్రం చదివినంతలో ప్రయోజనం లేదనియ్యేవే. ఆచదువు నూటికి నలభైయో యేభైయో మార్కులు తెచ్చుకోవడానికే వుపకరిస్తుందనడానికి వేఱే సాక్ష్యంతో పనిలేదు. యీ “అమ్మా! మాదాకవళం" కూడా వొక కవిత్వమే అనివాదిస్తూ దానిసమర్ధనానికి పూర్వోక్తరీత్యా బొత్తిగా వుపకరించని "ప్రసిద్దేషు ప్రబంధానాం” అన్నదాన్ని వుదాహరించడమే. ఆనంద వర్ధనాచార్యుల కాలంలోనే యీప్రసంగం వస్తే యేమయేదో? అది నా భావనకు గోచరించినా వ్రాసేది లేదు. పూర్వులకట్టుబాట్లతో రచనచేసే శక్తి మాకు భగవంతుఁడు యివ్వలేదు గనక, మేము దానితోవ వదులుకొని యీమార్గాన్ని అవలంబించామంటే వొక్కమాటతో తేలిపోయేదానికి యీ "మాదాకవళ" సమర్ధనానికి (కొత్తకుండా, పాతతెడ్డూ) పూనడమేకాక, ఆ మహామహుని శాసనం కళంకితం చేయడమనేది పెద్ద అపచారం. పైకి అనకపోయినా యీ రచనలు రచించేవారి -