పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/525

ఈ పుట ఆమోదించబడ్డది

529



“శుభస్యశీఘ్రమ్”

అయ్యా! "సంధిమిచ్చంతి సాధవః" అనే లోకోక్తి ననుసరించి మీరునన్నెం తతూలనాడి, దూషించి, చెడతిట్టి వెగటుగాప్రవర్తించినప్పటికీ నాకది అపకారకం గాదనిన్నీ మీకే అది యెంతసవరించుకోవాలని ప్రయత్నించినా (భవతిహృదయదాహీ శల్యతుల్యో విపాకః) సవరణకాక బాధిస్తుందనిన్నీ ఆతొందర పాటును నేను లెక్కింపక మీతో సంధికిగా మనస్సా ప్రయత్నించి మీకు కవితా సామగ్రి సరియైనది లేశమున్నూ లేదని యెఱిగిన్నీ గణయతి ప్రాసలకూర్పు కొంతసాఫుగా వుండుటచే (బహుమానించడానికి యేదో మిష వుండాలికదా) నేను సంతోషించి మిమ్మల్ని సమ్మానించాలని త్రికరణశుద్ధిగా యేర్పరచుకొని యెంతో గౌరవంగా నిష్కపటంగా ఆహ్వానిస్తే మీరుదాన్ని అవమానకరంగా భావించి కావలిస్తే నేనే మీకు సమ్మానం చేయడానికి సిద్ధంగా వున్నాను. మావూరే రావలసిందంటూ వ్రాస్తారే? మీ వ్రాత యుక్తిసహంగా వుందా? లేకపోయినా మీ కోరిక ప్రకారం రావడానికైతే సిద్ధపడతానుగాని మీరేమనుకొన్నారో? నేను బొత్తిగా దుర్బల స్థితిలోవున్నాను. సుమారు యేడెనిమిదియేళ్లనుండి నేను అతిమూత్ర వ్యాధితో అతిమాత్రంగా నలుగుతూన్నాను. అందులో వకసంవత్సరాన్నుంచి మఱిన్నీ అందులో గతించిన వేసవి మొదలుకొని మఱీమఱీనిన్నీ నేను వస్త్రధారణం కూడా బరువయి చేసికొనే శక్తి తగ్గి "కౌపీనవంతః ఖలుభాగ్యవంతః." అనేకృపణస్థితికి వచ్చి సంవత్సరన్నఱకన్న యెక్కువ కాలమే అయినది. ఇట్టి నన్ను ఆహ్వానించడానికి మాయింటికివచ్చి కొందఱు మాటదక్కదేమో? అని భయపడి మోమోటపెట్టక తిరిగి వెళ్లుచున్నారు. ఈ స్థితిలోనే చెన్నపట్టణంవఱకున్ను నన్ను బలవంతపెట్టి శ్రీతిరుమల శ్రీనివాసత్రిలింగపీఠంవారు నిరు డీరోజుల్లో తీసుకువెళ్లారు. భగవదనుగ్రహం తిన్నగావుండడంచేత వారికి అప్రతిష్ఠ లేకుండా మళ్లా యిల్లు చేరఁగలిగానుగాని చాలావ్యయం రాకపోకలకు వారికి తగిలింది. నిరిటి కన్ననూ మిక్కిలి తక్కువస్థితిలోవున్ననన్ను యీ మధ్య తెనాలివైశ్యులు ఆహ్వానించారు. బలవంతంమీద వెళ్లడమూ రావడమూ జరిగింది. అంతే కాని సభలో నాలుగుమాటలు మాటాడేనో? లేదో? నాకు బాగా తెలియదు. యిప్పటి నాతూకం యేబైపౌనులకన్న కొంచెం తక్కువలోనేవుంటుంది. యిట్టినన్ను కృతిప్రదాతృత్వద్వారా మామగారున్నూ, తద్ద్వారా గురుపంచకంలోవారవడంచేత పరమపూజ్యులున్ను అయినమీరు మనుగుడుపునకో