పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంకప్ప సోమయాజులు

55

యిలా పోల్చినందుకు ఆ సభలో పండితులు సమ్మతించక మామీందకి లేచారు סכGסכO ఆ సభలో మాగురువు బ్రహ్మయ్యశాస్రుల్లుగారు కూడా వున్నారు. మామీదికి లేచిన పండితులకు సమాధానం చెప్పి మా మాట మేము నిల్పుకున్నాము. యీ విషయం యెఱిఁగినవా రీదేశంలో యిప్పటి కింకా పలువురుంటారు. యింతకన్న యీ విషయాన్ని విస్తరిస్తే “రామాయణంలో పిడుకల వేట్గాట"గా వుంటుందని వదలుతూవున్నాను. ప్రధానం పాపయ్యశాస్రులవారి వాజ్మాధుర్యం సంగీతం వంటిది, అభినయం వంటిది - అంతేకాని “ఆస్సే చూస్సివ షే, వషే! చెవుడపే! అష్టాగపే యేమిషే? విస్సావర్ణులవారి - బుట్టినప యా విస్సాయి కిస్సారుషే!” వంటిదికాదు అన్నది యిక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం. వాఙ్మాధుర్యం యిట్టిదని శాస్త్రమేమేనా రాదా? వ్యాకరణం, పూర్వమీమాంస యింకా యితర శాస్తాలు వచ్చునాయె, యిఁక ఆయనకుసాటి - యీ లోకంలోనే కాడు స్వర్గలోకంలోనే అనుకుందాం - యొక్కడ దొరుకుతుందో ఆలోచించుకోండి చదువరులు. యిన్నిటికన్నా సభారంజనకు వాఙ్మాధుర్యం ಮಿಭ್ಯಂ. "ವಿನ್ గోరసం కోరసః పండితానాం” అని వూరకే అనలేదు అభియుక్తులు. గోరసం అంటే వాజ్మాధుర్యం. ఇంత వాఙ్మాధుర్యం కలవారు కనుకనే పాపయ్యశాస్రులవారు మహాకవిన్నీ సంగీత సాహిత్యపారంగతులున్నూ మహాపౌరాణికులున్నూ అయిన శ్రీశిషు కృష్ణమూర్తిగారితోకూడ వాదోపవాదాలు వచ్చినప్పడు లోకులకు స్తోత్రపాత్రులు కాగలిగారు. పాపయ్య శాస్తుల్లుగారికిన్నీ శ్రీకృష్ణమూర్తిగారికిన్నీ జరిగిన వాదోపవాదాలు ప్రత్యక్షంగా విన్నవారు నిన్న మొన్నటిదాకా శ్రీ పిఠాపురపు సంస్థానములో నున్నూ యితరత్రానున్నూ పలువురు పండితులుండేవారు. అందులో కొందఱిని నేను ప్రత్యక్షంగా యెఱుగుదును. పాపయ్య శాస్రులవారు కుమారుండు సూర్యప్రకాశశాస్రుల్లుగారివలె తేజశ్శాలి కారంట! పొడుగుగా చామనచాయగా సన్నముగా వుండేవారంట. వారు నీర్కావిబట్టలే ధరించేవారంట. వారి చేతులోవుండే రాగిచెంబు పైభాగం నల్లగానే వుండేదంటకాని లోపలభాగం బహుపరిశుద్ధి కలిగివుండేదంట. పండితులకు ముఖ్యంగా కావలసిందేమిటి? అంతశ్శుద్దేకదా! యీఅంశాన్ని లోక్రానికి తెల్పడానికే వారల్లటి పాత్రను ధరించేవారేమోనని నే ననుకుంటాను. వీరి చిత్ర చరిత్రలు చాలావున్నాయి. వకటి రెండుదాహరిస్తాను. ఏకగ్రామవాస్తవ్య లవడంచేతన్లో యేమో, మొదటినుండిన్నీ శ్రీ శిష్టు కృష్ణమూర్తిగారికిన్నీ మన పాపయ్యశాస్రులు గారికిన్నీ విద్యావిషయంలో భిన్నాభిప్రాయా లుంటూవచ్చేవCట. పాపయ్యశాస్రులుగారికి వచ్చిన వేదం కృష్ణమూర్తిగారికిన్నీ వచ్చునుగాని యేమైనా వీరు కవితాభాగంలో ప్రధానంగా పనిచేయడంవల్ల 《원9 విషయంలో పాపయ్యశాస్రులగారికి లొక్కుతారనడం సత్యదూరంకాదు. పాపయ్యశాస్రులుగారు కవితా విషయంలోంగాని, సంగీతవిషయంలోఁగాని అసలు