పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/490

ఈ పుట ఆమోదించబడ్డది

494

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఒక్కొక్క ప్రతివంతున మాత్రము దాఁచి యుంచితిమి. వానిం జూచుటకేని దర్శనమునే కోరుచున్నాఁడను. లేదా? ఆ ప్రాంతములయందలి గ్రంథాలయముల నరయఁగోరు చున్నాఁడను. అట్లు తటస్థింపనిచో నోపికకొలఁది కొన్నాళ్లలో నాయా యీ గ్రంథభాగముల నెత్తి వ్రాసి పంపుదును. ఇఁక నొకటి వ్రాసి విరమింతును.

"వృథామాటయు, 'తోడనేనా' లోఁ జేరును" అని వ్రాసితిరే? ఈమాట కర్థమేమి తోడనేనా? అనునది లోకానుభవ సిద్ధమైయుండ మహాకవిప్రయోగారూఢమై యుండ "చిన్నచిన్న వ్యాకరణపుఁ బొత్తములవలన" సమర్థనీయము గాదన్న మాత్రమునఁ బరిహసింపఁదగినదియే యగునొకో? అగుచో “పంచాంగమున వ్రాయనిచో నక్షత్రములు గూడఁ బోవలెనే?” అతి విస్తర మెందులకు? ఈతోడనేనా ప్రయోగమునకు మా పాశుపతమున నున్న యక్కరములు వ్రాసి చూపుచున్నాను. “వీరికున్న తెల్వితేట లెంతటివో కనుఁగొనుట కొక చిన్ని యుదాహరణమిచ్చుచున్నారము. “అప్రస్తుత ప్రశంస" లో వీరు “ఆర్యులారా! ఇది అప్రస్తుత ప్రశంసయేనా?” అని యొకచో వ్రాసికొని, అది తప్పని సంశయించి శుద్ధపత్రికలో "ప్రశంసయేయా" అని దిద్దికొనిరి. దీనిచే వీరి తెల్వితేటలు తెలిసికొనవచ్చును. దిద్దిన ప్రయోగ మెంత యసహ్యముగా నున్నదో సహృదయు లెఱుఁగుదురు... ...ఇంతకు మొదటిది తప్పగునా? కాదా? అనునది విచార్యము. “ప్రశంస + ఏ + ఆ” అనియుండఁగా మధ్య నకారమెట్లువచ్చునని సామాన్యులు శంకింతురు. విశేషజ్ఞులు భాషాస్వభావముచే మధ్య “ను" అను సముచ్చయము చేరుననియుఁ గావుననే ఇందుమతీ పరిణయములోఁ గుమార ధూర్జటి “ఉ. ...నాల్గుకోటులే! నా? మఱియున్ ఘనంబుగ ధనం బొనఁగూర్చెద" అని యతిస్థానమున బ్రయోగించి యున్నాఁడనియు నుత్తరము చెప్పుదురు. ఇట్లు వాక్యాలంకారముగా “ను" చేరునట్లు కొన్నిగలవు. ఈ యంశ మిందే 93వ పుటలోఁ గొంత తెల్ఫియుంటిమి. చెవి కింపుగలిగి యేమాత్రమేని సమర్ధింపవలనైన దానిని వదలఁగూడదనియుఁజెవి కింపులేక శాస్త్రసిద్ధమైనను దానిని వాడుట అంత హృదయంగమము కాదనియుఁ బూర్వకవుల యాశయము" ఇత్యాదికము సపాశుపతాశ్వమేధమునఁగలదు. ఇందున “ను" అనునది మన యాంధ్రాచార్యుల భారతములోని "లేకను" అనుచోఁ గలదానికన్న ననర్థము కాదుగదా? మీయాశయమును దెల్పుదురుగాక! మీరు “అందఱకు” గ్రాంథికముగా లభింపదనిరి. ఎవరిని సంతోషపెట్టఁగలము. “మహాఋషీణాం మతయశ్చ భిన్నా" ఇట్టివి వృథాగా రంగమున కెక్కించి మీరు పని కల్పించుకొని, యొరులకు పనిగల్పించినవి పెక్కులున్నవి, కాన విస్తరింపను. మీరు "ప్రతివిమర్శనమున" వ్రాసినదానిలో దేనినో యొకదానిని నిర్దేశించి విస్తరించి వ్రాయవలసినదని విధింపుఁడు. తెలిసినయంతలో వ్రాయుదును. మీ విమర్శన