పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/482

ఈ పుట ఆమోదించబడ్డది

486

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యాశయము. అగుఁగాక, దానిని విమర్శించినపుడుత్తర మిత్తుముగాక, యని యిపు డుపేక్షించుచున్నారము. మఱియు, “పాఱుఁబోతులు అనుంగతి" ఈ ప్రయోగము లసాధువులఁట? విమర్శకుల భాషాజ్ఞాన మెట్టిదో కాని,

[1]చ. పరిణతశక్తులైన యలభారతపుంగవు లట్టులుండ ము
      ష్కరుఁ డనిపించుకొన్న కవి సామాజ సింహము రామకృష్ణువా

(గ్విరచనముగూడఁ జిత్తగించలేదు. పాపము, ఇటుపైనేని జిత్తగింతురుగాక)

     గ్విరచనగూడఁ జూడుఁడు ప్రవేశఫలమ్ములు చిన్నిచిన్ని వ్యా
     కరణపుఁ బొత్తముల్ సదివి కయ్యము పెంచకుఁడయ్య వాగ్విదుల్.

రామకృష్ణకవి యనఁగా? "చ. ఒకని కవిత్వమం దెనయునొప్పులు దప్పులు నా కవిత్వమం దొకనికిఁదప్పు వట్ట బనియుండదు." అనియును, "చ. తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరమ్ములం బలుకగరాకురోరి పలుమాఱు" అనియును బ్రతిజ్ఞచేసి నిర్వహించుకొన్నట్టియు, మ. “ఉదయంబస్తమయంబు... నీ కెదురేరీ?” అని వెలుగొందినట్టియు మహాకవి. అతఁడు తన కబ్బమున 1 ఆ - మున, “అయ్యింతి చెక్కులఁబోలుం దెలనాకులు" అని ప్రయోగించి యుండెనే? దానింగూడ శాస్రుల వారు తృణీకరింతురో? తృణీకరింపరు. అన్యథా సిద్ధికై కడంగుదురు, చూచెదముగాక. వీరింకను నిట్టియవిచార మూలకములగు నాక్షేపణ లీఘట్టమున మఱియుం గొన్ని చేసియున్నారు కొన్నిటి యసారతను దెలిపి తక్కిన వుపేక్షింపఁబడుచున్నవి. మఱియు, "ఇట్లనే, అట్లన" యవి తప్పులఁట! పాపము వీని సాధుత్వమునకై కొంత పాటుపడిరికాని తుదకుఁ గుదురలేదు. వారేమి చేయుదురు. అంతతో విసువుపుట్టి "కావునఁబై ప్రయోగమెట్లను దుష్టమే". అనియొక రంకెవైచి విరమించిరి. “మ. ... ... ఎప్పటట్లనయే నుండక" “ఉ. ... ... రాముని మ్రోల నాలుకలు రానటులన్" అను రామాభ్యుదయ ప్రయోగములును, “చ. ... లలితకరాబ్జరాగ మిటులన్ బ్రసరించి" అను రుక్మిణీపరిణయ ప్రయోగమును వీరికెట్లు కుదిరెడినో! ఇవి యింతకుమున్ను పాశుపతమున నుదాహరింపఁ బడినవియే. వీనికిగూడ, నన్యథాసిద్ధి యున్నదో వినవలయు, మఱియు “జనుఁడు" దీనికై యేమో వ్రాసి యెక్కడనో, ప్రయోగమున్నట్లు జ్ఞాపకమనికూడ లిఖించి, తుట్టతుదకు "అనుకరణముగ నున్నది గావున సాధువే" అని గతికల్పించి శ్రమపడిరి. ఇంత పరిశ్రమ మెందులకో? “ఆ. వె. జరయు మృతియులేని జనునట్లు" అని చిన్నయ్యసూరి ప్రయోగించెనే? అది

  1. (సతికి) అని పాఠాంతరము.