పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/467

ఈ పుట ఆమోదించబడ్డది

వెక్కిరింపఁబోయి బోల్తాపడుటయే - 2

471


తే.గీ. “కొడుకు నామేనగోడలికొడుకుcగూడ
       శతవధానంబు నాఁ జనుస్యందనంబు
       నడపుటకు నాకు మిగుల నానంద మయ్యు
       మనములో నున్న కోరిక మఱపురాదు".

చ. తిరుపతి నేనునుంబలెనె తిర్పతిపుత్రుఁడు మత్సుతుండు ని
    ర్వురు గవగూడి సత్సభలఁ బొంపిరివోయెడిపాండితిన్ బర
    స్పర మవధానమున్ సలిపి పండితులం దరఁగించుచో యశ
    స్కరమగు మాకు నిర్వురకు సర్వవిధమ్ముల నంచు నెంచెదన్.

తే.గీ. “ఇందులకుఁ దగ్గ సామగ్రి యేఱుపడియుఁఁ
       బట్టదయ్యె నీదృశమహాభాగ్యగరిమ
       వచ్చుతరముననేని తిర్పతిమనుమలు
       నామనుమలు తీర్తురుగాక నాదుకోర్కి."

విస్తర మెందులకు? తి. వెం. కవుల యవినాభావ మెఱుఁగని వారెవరు? “రోళ్లా రోకళ్లం బాడినకూరుము లెపుడింతదాఁచికొన్ననణఁగునే" అయ్యది దేవీభాగవతమునందలి శివశక్తుల యభేదమువంటిది.

ఆ.వె. “అతఁడ యేను నేన యాతఁడు భేదం బొ
        కింతయేని యుండ దిరువురకును
        బుద్ధిమంతులైన పురుషు లెఱుంగుదు
        రెఱుఁగలేరు బుద్ధిహీనజనులు."
                                         - దేవీభాగవతము, 3 స్కంధము

తి. శా.గారి బిరుదములు వేం. శా. గారికి, వేం. శా. గారి బిరుదములు తి. శా. గారికి సమన్వయించినట్లే, ఆయన ప్రతిఫలన మీయనకును, ఈయన ప్రతిఫలన మాయనకును కడు సుళువుగా సమన్వయించునని మున్ముందే నిరూపింపఁబడినది. వాస్తవమునకు హంసములు రెండుగాని యొక్కటిమాత్రమే కాదనుట నిర్వివాదము. విమర్శకుఁడుగారు హంస మొక్కటిమాత్రమే వసుదేవుని యాగమునకు వెళ్లియుండలేదను చోట్ల నుదాహరించియు నీయంశము స్ఫురింపక కాఁబోలు లేనిపోని వికల్పములకుఁ గడంగెను. హంసములు రెండైనను దేనియం దెవరు ప్రతిఫలించిరో యనునంశము విడఁదీయవలసిన యావశ్యకత లేదు. నాటక మొక్కరే మొదలిడినను నిరువురు మొదలిడినట్లే