పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/465

ఈ పుట ఆమోదించబడ్డది

వెక్కిరింపఁబోయి బోల్తాపడుటయే - 2

469


ఇట్టి ప్రాజ్ఞులకొఱకే కాఁబోలును కాటూరి వేంకటేశ్వరరావు జాతకచర్య పీఠికలో నీక్రింది యక్కరములు లిఖించినాఁడు. “ఈగ్రంథము వేంకటశాస్త్రులవారి పృథగ్రచనమే యైనను - “ఒక్కరు రచియించిరేనియును గాఁదగుఁదిర్పతి వేంకటీయమై" అనువారి సమయము చొప్పున నుభయకర్తృకముగానే ప్రకటించితిమి.” పైరీతి నంగీకరించి ప్రకటించినవారికి మన విమర్శకుఁడుగారికిఁ గల్గిన సందేహము కలుగలేదనుకోవలయునా? ఈ సమయము ప్రస్తుతవిమర్శకుఁడుగా రెఱుఁగ రనుకోవలయునా? లేక యెఱిఁగి కూడ దీనివిషయమున విమర్శకుఁడు తనయనంగీకారమును లోకమునకుఁ దెల్పుటకే యీవ్రాఁత వ్రాసియుండుననుకో వలయునేమో? తుది యభిప్రాయము కూడ నిలువదు. ఏమందురా? అట్లే యైనచో తి. వేం. కవుల సమయము నుదాహరించి పిదపఁ దన యసమ్మతిని దెలుపవలసియుండును. అట్లొనర్పలేదుకదా? అదియునుగాక తి. వేం. కవుల సమయమును కాదనుట కీవ్యక్తికేమి యధికారము? ఇంతవఱ కెవ్వరును దీని నంగీకరింపనివారు లేరే? పైఁగా వీరి కీమైత్రి యెట్లింతకాలము నిలచినదని యక్కజపడుచు సంతసించుట జగత్ర్పసిద్ధమే కావున విస్తరింపను. తి. శా. గారి స్వర్గతికిఁ బిమ్మట నొకపుష్కరపరిమిత మగు కాలమునకు జరిగిన నా షష్టిపూర్తిసందర్భములో నొకరు తిరుపతి శాస్త్రిగారు కూడ వచ్చి యాసభ నలంకరించినట్లే భావించినారు. చూడుఁడు. "తిరుపతి దివ్యరూప మరుదేరెను మీదగు షష్టిపూర్తికిన్", కవికి ముఖ్యమైనది భావనాశక్తి అట్టిశక్తిని పైపద్యములో తత్పద్యకర్త ప్రదర్శించినాఁడు. ఇఁక తి. శా. గారి కొమారుని భావశక్తి నుపపాదించి విషయాంతర ముపక్రమింతును. ‘వేంకటేశ్వరరూపమ్మున నున్న తండ్రికి నమోవాకమ్ము లర్పించెదన్". ఆయీ భావనలవలన లోకులు విద్యాసందర్భమున వారొనర్చు కొన్న సమయము నేమాత్రమోకాక పూర్తిగా నామోదించుచున్నట్లు స్పష్టము. ఈ విషయమున నుదాహరింపవలసినచో నెన్నియో కలవు. విస్తరభీతిచే సూచించి విడచితిని. విమర్శకుఁడుగా రిట్టిలోకులలో నొకరుకదా? వీరీ మార్గమును వదలి "నేల విడిచిన సామునకు దిగు" టెట్టిదో? బందరులో కారణాంతరమున నొకరేకైకొన్న గండపెండేరము వేఱొకరికిఁ గూడ నున్నట్లే సమన్వయించుకొన్నట్లును, కాకినాడలో నిం దొకరుమాత్రమే జపించిన రాజరాజేశ్వరీవిద్య యుభయులకును గలిగినట్లే సమన్వయించుకొన్నట్లును ప్రథమాంకము నందలి శుచిముఖి వాక్యములవలన సుళువుగా దేలుచున్నను విమర్శకుఁడుగారు “ముంజేతి కంకణమున కద్దము"ను గోరినట్లు "జీవతః కవేః ప్రష్టవ్యమ్" అని యీ వృథావ్యాపారమునకు దిగినకారణమేమో? మఱియు జాతకచర్యలో “ఆ – యయలకు లేదు భేద మరయంగc గుటుంబములందుఁ దక్కినన్" అని కంఠోక్తిగాఁ జెప్పఁబడియున్నదే! మాకు జరిగిన