పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/435

ఈ పుట ఆమోదించబడ్డది

439



వెక్కిరింపఁబోయి బోల్తాపడుట

పైసామెతను అసంగతముగా నుదాహరించుచు నన్ను మిక్కిలిగా వెక్కిరించుచు, పిలువని పేరంటముగా, పనిలేని పాటగా, ఓలేటి - కాదు, వోలేటి సుబ్బారాయ శాస్త్రులవారు గతమాసపు భారతీసంచికలో - "ప్రభావతీప్రద్యుమ్నము" అనుశీర్షికతో నొకవ్యాసమును ప్రకటించినారఁట! ఇదివఱలో భారతి నాకును వచ్చెడిది కాని నేనెన్నఁడుగాని యేవ్యాసమును పంపలేని కారణమునఁగాఁబోలును సుమారువత్సరము నుండి యదివచ్చుటలేదు. అందుచే దానిని నేను జూడలేదు. ఏమి తోఁచినదో, ప్రస్తుతము మద్రాసునివాసి, పురాణం సూర్యనారాయణ తీర్థులుగారు నాకు సంబంధించిన వ్యాసభాగమును పంపిరి. పత్రికవారికిఁ దోఁచలేదు గాని, తక్కినవి పంపకున్నను ఈ సంచికనేని వారే పంపవలసినది. అది యటులుండె, ఎట్లయిన నేమి? వ్యాసము చేరినదిగదా! చేరుఁగాక, చదివికొనుశక్తి యుండ వలయునుగదా! రెండు సంవత్సరముల నుండి నేను మిక్కిలి యనారోగ్యముగ నున్న సంగతి యెఱుఁగనివారెవరు? అట్లగుటచే చదివించి విని, అవగాహన చేసికోవలసి వచ్చినది. తేలిన సారాంశము -

“పూర్వోత్తర విరోధముగా గ్రంథము వ్రాసి పాడుచేసినా రనునదియే." అది ప్రధానము. వెక్కిరింపులు, టక్కులు టమారాలు. ఇవితో వాసములు. ముసలివాళ్లను కుఱ్ఱలు వెక్కిరించుటలో తప్పేమి? అది యటులుండె. విమర్శకులు తమరెత్తుకొన్న యంశమును స్థిరపఱచుటకై- గ్రంథకర్త వజ్రనాభుని మనుమలు ముగ్గురనియొకట, నల్వురని వేఱొకటవ్రాసి, తప్పొప్పుల పట్టికలో సవరణను చూపెను గాని ఆ సవరణ వచనములలో లగించును గాని పద్యములలో లగింపదని కొంత గ్రంథము వ్రాసి తుదకాపద్యములలో సవరింప వీలగునని మూడునాల్గుగా స్వయముగా సవరించుకొని పిమ్మట,

“ఈమూcగురు జామాతల
 కామూగురు పుత్రకులు మహాబలశాలుల్."

అనుపద్యము నుదాహరించి యిందు మూఁగురు నలుగురుగా సవరింపవలనుబడదని మిక్కిలి చింతించిరి శాస్త్రులవారు. తుదకు పూర్వోత్తర గ్రంథ విరోధమును