పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

39


గలవారో లోకులు తెలుసుకుంటారు. గోపాలశాస్రుల్లుగారే పూర్వపక్షం చేస్తే కొంతసేపేనా రాజావారి కుతూహలం తీరేది. అలా జరక్కపోవడంచేత మొట్టమొదటే శాస్తార్థం ఆగిపోయింది. “ప్రథమ కబళే మక్షికాపాతః".

సుబ్బన్న శాస్రుల్లగారి దర్శనం చేయలేదుగాని శ్రీకర్ణాట సీతారామ శాస్రుల్లగారిని మట్టుకు నే నెఱుంగుదును. యీ దేశంలో తర్కంలో మహాపండితు లనిపించుకోవడమే కాకుండా యెందఱినో మహావిద్వాంసులను చేసిన పండితులు, వారుచెప్పేపాఠాన్ని అవగాహనచేసుకోలేకపోయారంటూ పెద్దలవల్ల వినడం. యిందులో కొన్ని మాటలు మూఢభక్తికల్పితాలుంటాయి. కాని ఏమేనా కర్ణాట సీతారామశాస్తుల్లుగారి ప్రతిభ అద్వితీయం అన్నమాట స్వభావోక్తి కాకపోదు. యీ శాస్రుల్లుగారిబుద్ధి మిక్కిలి తీక్షణమయినదని గురువుగారు చెప్పేవారు. “గురుడు బ్రహ్మయ్యశాస్త్రి కొనియాడు నెవని కర్ణాట సీతారామసాటిచేసి" అని నేను మా తి| శాI గారిని గూర్చి చెప్పినమాట ఈ సీతారామశాస్త్రిగారికి సంబంధించిందే. ఆ సీతారామశాస్రుల్లగారు నీలదేవపండిజీవారి శిష్యులంట. లోకాతీతులైన యీ మహామహుణ్ణిగూర్చి - "సీతారామ్కూబ్ జాన్రీహై" అని పండిజీవారు సెలవిచ్చేవారంట. తర్కశాస్త్రంలో పండితులనిపించుకోవడం చాలా అరుదు. వ్యాకరణం మొట్టమొదట మిక్కిలీ కష్టంగా ఉన్నట్లు కనబడుతుందిగాని యే నాలుగైదు మాసాలో శ్రద్ధపుచ్చికొని అభ్యసిస్తే క్రమంగా పేలపిండివైఖరిగా ఉంటుంది. యిటీవల వ్యాకరణాన్ని తర్కశాస్త్రంలో పూర్తిగా మిళితం చేయడంచేత ఇదికూడా కొంత దుర్బోధంలోకి వచ్చింది. కాని, మొట్టమొదట - అనంగా - కౌముదీరచననాంటి వరకున్నూ అంత దుర్భోధస్థితి వ్యాకరణానికి రాలేదు. కాశికావృత్తి నాంటికి చెప్పనక్కరలేదు. ఆ కారణంచేతనే అప్పటి పండితులు చాలామంది సాంగంగా వేదం అభ్యసించిన వాళ్లుగానే వుండేవారు. యిప్పడో వకటివస్తే రెండోది రానివాళ్లే తఱచుకనపడతారు. కారణం ఒక్కొక్క శాస్తానికి సుమారు పదేళ్లకు తక్కువ కాలం పట్టదు. యావత్తున్నూ సరిగా కృషిచేయరుగాని, చేసేయెడల ఓంకారంలో సర్వవేదాలు యిమిడినట్లు తర్కశాస్త్రంలో సర్వశాస్తాలూ యిమిడాయని చెప్పవచ్చును. ప్రత్యక్షఖండ మాటట్లావుంచినా అనుమానఖండ వక్కటితప్ప యెవరోగాని ఉపమాన శబ్దఖండలుకూడా చదవరు. ఉపమానఖండలోదే అలంకారశాస్త్రం యావతూ అనుకోవచ్చు. వ్యాకరణం శబ్దఖండంలోదిగదా? యిక కావలసిందేమిటి? వక్క వేదంతప్ప తర్కంలో సర్వమున్నూ గతార్థమవుతుంది. పైCగా దాన్ని చదివి పూర్తిపాండిత్యాన్ని సంపాదిస్తే వారిముందర బ్రహ్మాండనాయకుండుకూడా నిల్వనేలేడు. తిమ్మిని బ్రహ్మినీ, బ్రహ్మిని తిమ్మినీ చేసేశక్తి తార్మికులకుతప్ప వేటెవ్వరి కుంటుంది.? చూడండి- ఆ శాస్త్రంలో విజ్ఞలైనవారి ప్రతిజ్ఞలు-