పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


యింతేభేదం. పిశాచాదులను బొత్తిగా నమ్మనివారే పలువురు. వీరు నేడేcకాదు పూర్వమున్నూ వుండేవున్నారు. నేనుకూడా చాలాభాగం యీ తరగతిలోకే చేరతాను. కాని యే కొంచెమో నమ్ముతాను. యీ మధ్య మాయింటిలోనే యీ పీడ తటస్థించింది. సామాన్యులు కొందరువచ్చి "హాత్తు హూత్తు" అంటూ జడిపించారు. రక్షరేకులు కట్టి వెళ్లారు. లక్ష్యపెట్టలేదు. నా పినతల్లికుమారుడు యీ విషయమై ప్రవేశం కలవాఁడున్నాండు. అతడు వచ్చి ఒక రోజు మాత్రం జపంచేసి యేవో అంకెలువేసి బంగారపు రక్షరేకు కట్టి వెళ్లాడు. అంతటితో ఆ పీడ ఆగింది. కాని ఆ గ్రహం ఆ పిల్లమీందకు మాత్రం రాకుండానే ఆ రక్షరేకు పనిచేస్తుంది కాని, అసలు గ్రహాన్ని వూల్లో లేకుండా చేయలేదట. ఆ గ్రహమే మాకు సంబంధించిన విద్యార్థి భార్యను ఆశ్రయించినదని అన్నారు. రక్షరేకు ఇచ్చినాడు. ఆపెకున్నూ నివర్తించినది. ఇక దీనిలోకి దిగితే తేలదు. లేదని మాత్రం నేను చెప్పలేను. వుందనే చెపుతాను. ప్రస్తుత చరిత్ర దీన్ని వప్పుకొనే విశ్వాసం మీందే ఆధారపడివుంది.

సరే, మహాసభలో యిదివరలో వుదాహరించిన పండితులిద్దటికీ వకరోజున శాస్రార్థం జరిగింది. యెవరు పూర్వపక్షం చేయడం?- సిద్ధాంతం చేయడం యెవరు?- అనే ప్రశ్న వచ్చింది. యిక్కడ కొంత వ్రాయాలి; పూర్వపక్షం చేసేవారికంటె సిద్ధాంతం చేసేవారికి గౌరవం హెచ్చు. కాబట్టి పూర్వపక్షకోటిలో చేరడానికి మహాపండితులు అంగీకరించరు. గోపాలశాస్రుల్లుగారు "నాది సిద్ధాంతకోటి" అన్నారు. సుబ్బన్న శాస్రుల్లుగారు "అలాఅయితే నేనే పూర్వపక్షం చేస్తా" నన్నారు. కాశీలో యేంచేస్తారంటే; యిలాటి సందర్భాలలో యెవరో విద్యార్ధిచేత ముందుగా పూర్వపక్షాన్ని వుపపాదన చేయిస్తారు. దానిమీంద ఆయా పండితులు అందుకుంటారు. ఇది సామాన్యంగా వినోదార్థం జరిగే సభల ముచ్చట. ವಿಟ್ಟು పటాంగాల మీంద జరిగేవయితేనో : “నే పూర్వపక్షంచేస్తే నీవుచెప్పఁగలవా?" అని యెవరంటారో వారిదే పూర్వపక్షకోటిగా వుంటుంది. సుబ్బన్న శాస్రుల్లుగారు యొక్కడో వకచోట పూర్వపక్షం వుపపాదించారు. బహుశః వక అరగంటసేపు దానికి పట్టివుంటుంది. లేదా ఒక గంట పట్టి వుంటుంది. మాధ్యస్థ్యంచేసేవారు పూర్వపక్షాన్ని యావత్తున్నూతమస్వంత మాటలతో సంస్కృతంలోనే అనువాదంచేసి సిద్ధాస్తంచెప్పేవారికి తెలియపరచాలి. బహుశః యీయన జడ్డీగారికోటి బోధపడితేనా ఆ పూర్వపక్షధోరణి? అందుచేత మండపేటనుంచి మాధ్యస్థ్యానికి వచ్చిన పండితులున్నూ తెల్లపోవలసి వచ్చింది; సిద్ధాంతం చెప్పాలని కూర్చున్న గోపాలశాస్తుల్లుగారున్నూ తెల్లపోవలసివచ్చింది. అంటే వీరిద్దఱున్నూ మహా గొప్పవిద్వాంసులే అయినా తణికెళ్ల సుబ్బన్నశాస్రుల్లగారు చేసిన పూర్వపక్షానికి జవాబు చెప్పడంమాట దేవుండెఱుంగునుగాని, ఆ మహామహుండు చేసిన పూర్వపక్షం యిట్టిదనికూడా - తెలిసికోలేక పోయారనడంవల్ల ఆ సుబ్బన్న శాస్రుల్లు గారు ఆ శాస్త్రంలో యెంత ప్రజ్ఞ