పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/295

ఈ పుట ఆమోదించబడ్డది

వెనకటి పండితులు

299


రంగాచార్లగారు దయచేస్తున్నారు. రెడ్డిగం తీసివేయవలసిం” దనేటప్పటికి వినీ విననట్లు అనాదరించి శాస్త్రుల్లుగారు వూరుకున్నారనిన్నీ తరువాత క్రమంగా అది ముదిరి నన్ను జయించే పండితులు వచ్చేటప్పుడుగాని యీరెడ్డిగం నేను తీయవలసి వుండదని లక్ష్మీనారాయణ శాస్త్రుల్లుగారు జవాబు చెప్పడం తటస్థించిదనిన్నీ యింకా యేమో యేమో పండితులు చెప్పుకోఁగా విన్నాను. రంగాచార్లవారు షడ్దర్శనీపారంగతులు, లక్ష్మీనారాయణ శాస్త్రుల్లుగారు వ్యాకరణ శాస్త్రంలో మిక్కిలీ అభిమానంగల మహాపండితులు. అంతమాత్రమే కాదు, ఆయన సభలో సంస్కృతం మాట్లాడుతూవుంటే సాక్షాత్తూ మహాభాష్యాన్ని మఱపించే వుండేదఁట వాక్యరచన. రంగాచార్లవారికి అభిమానశాస్త్రం తర్కం. నాఁటి సభలో లక్ష్మీనారాయణ శాస్త్రులుగారు రంగాచార్యులవారికి అభిమాన శాస్త్రమైన తర్కంలోనే రంగాచార్లగారితో శాస్త్రార్ధంచేసి పండితులను మెప్పించినట్లు చెప్పకోఁగా విన్నాను. ఆలాటి సర్వతోముఖ పాండిత్యాలు క్రమంగా కాలదోషమో? ఏమో? చెప్పఁజాలంగాని “గానుగు రోకలి సిద్దిపిడి"గా మార్పుచెంది నానావిధ దైన్యాలకి పాల్పడుతున్నాయి. ప్రతి విషయంలోనూ ఆనాఁటి పండితులకు కొన్ని నియమాలు వుండేవి. అపరగౌతములని ప్రసిద్ధి వహించిన కీ శే శ్రీపాద రామశాస్త్రులుగారికి (వీరు తమ్ములున్నూ శిష్యులున్నూ అయిన లక్ష్మీనరసింహ శాస్త్రులు గారు సజీవులు, చాలావృద్దులు, మళ్లా అన్నగారంతవారు, పిఠాపురాస్థాన విద్వాంసులు) వొక నియమం వుండేది. గృహస్థు (యెంత ఐశ్వర్యవంతుఁడైనా సరే) ఒకరూపాయికంటె అతనివద్ద యెక్కువ పుచ్చుకోమని నియమం. జమీందారువద్ద రు 10-0-0 కంటె అధికం పుచ్చుకోమనీ నియమం. వారి జీవితం ఆ నియమం భంగం లేకుండానే జరుపుకున్నారు. వారిని నేనుస్వయంగా యెఱుఁగుదు. యీ దేశంలో యిప్పుడెవరేనా నైయాయికులు వుంటే వారికి శిష్యులో ప్రశిష్యులో అయివుంటారు. యీ మధ్య కలకత్తా ప్రెశిడెన్సీ మిడ్నపు ప్రాంతంలో “శ్రీరామకృష్ణమిషన్" లో విద్యాభ్యాసం చేస్తూన్న విద్వాన్‌మైలవరపు పూర్ణానందం నాపేర వుత్తరం వ్రాస్తూ, వ్రాశాఁడుకదా మీ విద్యార్థిదశలో మనదేశంలో విద్యాభ్యాస పద్ధతి యేలాగు వుండేదో యేదేనాపత్రికకు వ్రాయవలసిందంటూ కోరివున్నాఁడు. దీన్నిబట్టిచూస్తే మనకు పూర్వం యెలా చదువుకొనేవారో కూడా యిప్పటివాళ్లకు పుస్తకాలదగ్గిఱికి వచ్చిందని తేలుతూవుంది. అతనికోరికనుబట్టి పనిలోపని ఈ మాటలూ వ్రాస్తూన్నాను. గురువులు యే సామాన్యులోతప్ప సుప్రసిద్ధభృతకోపాధ్యాలుగా వుండడానికి యిష్టపడేవారు కారు. "పంచమే౽షష్ఠేవా శాకం పచతి స్వేగృహే"గా జీవయాత్ర సాఁగిస్తూ పరమ బుద్ధితో శిష్యులను సుతనిర్విశేషంగా ఆదరించి విద్య చెప్పడమే వారి కృత్యం. (పైCగా కడుపునిండా అన్నం తినడానికి తగ్గంత