పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/269

ఈ పుట ఆమోదించబడ్డది

శిష్టావారి విశిష్టత్వం

273


సీతారామ శాస్త్రుల్లుగారు తడుముకోకుండా "తొమ్మిదేళ్లు" అనే చెపుతూ వుండేవారఁట. కొంచం తెలుగు మాట్లాడడం చేతనైన సదరు ప్రిన్సిపాల్ “వుల్లు గారు” “వాటీజ్ దట్" అని తనలో తానే ముసిముసినవ్వులు నవ్వుకొని వూరుకునేవారఁట! తుట్టతుదకువకనాఁడు ప్రిన్సిపాల్‌గారు గట్టిగా నిర్బంధించి అడిగేటప్పటికి- "తొమ్మిదేళ్లంటే అఱవై మూఁడేళ్లు" అని సమాధానం చెపితే దొరగారు చాలాసంతోషించి మళ్లా కొన్నాళ్లు వుండడానికి ఆర్డరు ప్యాసుచేశారఁట. ఆ శాస్త్రుల్లుగారి వాక్చాతుర్యాన్ని వర్ణించవలసివస్తే చాలాగ్రంథం పెరుగుతుంది. దీన్ని బట్టి మనకథానాయకుఁడు నరసింహ శాస్త్రుల్లుగారి వంశం అనాదిగా విద్యావంశమని మనం సంతోషింపవచ్చు. కథానాయకుని కుమాళ్లలో కొందఱు ప్లీడర్లుగానూ, కొందఱు ఉపాధ్యాయులుగానూ వున్నారు. విమర్శనాలు వగైరాలలో పాల్గొన్నవారున్నూ వీరిలో వున్నారు. వాగ్భంధం బ్రహ్మాస్త్రం మొదలైన పేళ్లతో అవి అచ్చయి వున్నాయి. మొత్తం శాస్త్రుల్లుగారికి సర్వైశ్వర్యాలున్నూ ఫలించాయన్నమాట. తుదకు "నాటకాంతం కవిత్వమ్” అనే అభియుక్తోక్తి సార్ధక పడేటట్టు యీ “ఇందిరాపరిణయ” నాటకాన్ని రచించారు. ఇది సముద్రమథనంతో ప్రారంభమయింది. నృసింహావతార కథతో పరిసమాప్తి చేశారు.

శ్లో. ఛన్నం వ్యోమతలం విమాననిచయై రభ్రైరివ ప్రావృషి
    శ్రావ్యాదిక్షు చరంతిదుందుభిరవా వర్షాసు నిర్హ్రదవత్
    విద్యుత్పజ్తినిభాశ్చరంతి వనితా దివ్యాఃప్రియై స్పైరితో
    బ్రహ్మా౽ండం నిరవద్య మద్య లలితం పాణిగ్రహే శ్రీహరేః.

ఉదాహరించిన శ్లోకద్వయం వల్లనే గ్రంథకర్త ధారాశుద్ధి యెట్టిదో విజ్ఞులు గురుతింపగలరు. యెంతపరిశీలించినా పాదపూరణార్థకములైన చ. వై. తు. హి. న. లోనగునవి కనపడవు. సుబంధు మహాకవి యే మన్నాఁడు!

“సత్కవికావ్యబంధఇవ, అనవబద్ధతుహినః"

అన్నాఁడు. యేసందర్భంలో? వసంతర్తు వర్ణనా సందర్భంలోనో, లేక గ్రీష్మర్తు వర్ణనా సందర్భంలోనో, ఋతుపక్షంలో మంచువుండదని గ్రహించుకోవాలి. మఱివక శ్లోకంకూడా చూపుతాను.

శ్లో. కీరాః కోరకితేషు కల్పతరుషుప్రారబ్దవేదాక్షరా
    వాతా శ్చందనవాటి కాంగణచలద్గంగా౽౽పగాంభ స్పృశః
    కించైతే విరువంతి పంచమరవం చూతేషు పుంస్కోకిలాః
    కుంజేషు ప్రతిబద్ధఝంకీతిరవా ధావంత్యమీ షట్పదాః,