పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/256

ఈ పుట ఆమోదించబడ్డది

260

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చిక్కువచ్చి చెరువు నీరు కొంత తగ్గించే వుపాయం చేయవలసిందని సూరకవిగారు కోరితే జమీందారులు తమ రయితులకు దానివల్ల నష్టం తగులుతుందని అంగీకరించారు కారనిన్నీ ఆపిమ్మట పైని వుదహరించిన మకుటంతో కొన్ని పద్యాలు చెప్పి ఆ వుపద్రవాన్ని తొలగించు కున్నారనిన్నీ చెప్పుకోవడం పలువురు యెఱిఁగినదే. ఆ పద్యాలు జ్ఞాపకంలేక వుదహరించ లేదు. గతమైన కవుల వృత్తాంతాలు పరిశీలిస్తే కవులు భిక్షాటకులుగానూ కనపడతారు, భాగ్యవంతులుగానూ కనపడతారు.

“సుకవితా యద్యస్తి రాజ్యేనకిమ్" అనివుండడంచేత ధనద్రవ్యాదుల మూలకంగా కాకున్నా కవిత్వంచేతనే కవులు భాగ్యవంతులు అనిసరిపెట్టుకుంటే సరిపోతుంది. లోకంలో ధనార్జనకు యేర్పడ్డవృత్తులు నాల్గేకనపడుతాయి

శ్లో. "వాణిజ్యే వర్తతేలక్ష్మీ స్తదర్థం కృషికర్మణి,
      తదర్థం రాజసేవాయాం భిక్షాయాం నైవనైవహి."

లోకంలోవున్న వృత్తులలో కవులుచేసేవృత్తి నాలుగోదిగానే కనపడుతుంది. కొందఱు కవులు రెండోవృత్తిని అవలంబించిన వారున్నారు. కాని వారు దానిలో ధనవంతులు కాలేదు.

1) “తదఖిలం త్యక్తాశ్రితస్త్వామహం” అన్నాఁడు వ్యావసాయకుఁడుగా మాఱిన కుట్టికవి దున్నపోతు ప్రభువునుగూర్చి అతఁడే-

‘శిష్టం మే త్వలమల్లకం" అనిన్నీ అన్నాఁడు తుట్టతుదకు. అలమల్లకంఅంటే, కౌపీనం, శ్రీనాథుఁడేమో:- .

"బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి, నెట్లుచెల్లింతుడంకములేడునూర్లు"

అంటూ విచారించాండు, పోతరాజుగారేదో విధంగా

“పంచమే౽హని షఫ్టేవా శాకం పచతి స్వేగృహే"

అనేశ్లోకార్ధానికి లక్ష్యభూతులై కాలక్షేపం చేశారు. బాగా పరిశీలిస్తే కవులవృత్తి కాళిదాసుగారు నిర్ణయించిన భిక్షాటనంగానే తేలుతుంది. యేకొందఱు కవులకో రాజులు అగ్రహారాలుయిచ్చి సన్మానిస్తూ వుండటంకలదు గాని అది క్వాచిత్కం. యెవరోపెద్దన్న గారివంటివారు "కోకట గ్రామాద్య నేకాగ్రహారాలను" సంపాదించినవారున్నా అందఱూ (నఖలు సర్వో౽పివత్సరాజః) తాదృశులు కారు. యీవిషయంలో కవులకూ, గాయకులకూ యెంతోతేడా వుండదు. కవులకంటె గాయకులే అదృష్టవంతులని ఎవరో కవి చెప్పిన శ్లోకంవల్ల గోచరిస్తుంది. దాన్ని కొంచెం వుదాహరిస్తాను.