పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/251

ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

255


చాలా విద్యలలో ప్రవేశంకల మహావిద్వాంసులు, మంచి కవులూను, గొప్ప రాజాస్థానాలలో పేరు ప్రతిష్ఠలు పొందిన వారున్నూ, సంస్కృతంలోనూ తెలుఁగులోనూ కొన్ని గ్రంథాలు రచించారు. చిరకాలం జీవించారు. చిన్నయసూరి, కోరాడ రామచంద్రశాస్త్రుల్లు గారు (బందరు) మొదలైనవారు వీరి శిష్యులు. దివ్యమైన అత్యాశువులో ఆకాశపురాణం (సంస్కృతంలో) చెప్పే అసదృశ ప్రజ్ఞకలవారు. కాని లక్ష్మణకవి గారి పేరు భాషా ప్రపంచంలో శాశ్వతంగా నిల్చినట్లు - (అంతఘాటుగా నన్నమాట) కృష్ణమూర్తిగారిపేరు నిలవడానికి ఆస్కారం లేకపోయింది.

1. యక్షోల్లాసం, 2. సర్వకామదా పరిణయం వగయిరాలు ఉభయ భాషలలోను ప్రబంధాలున్నాయి వీరివి. మంచిచాటువులున్నూ వున్నాయి. వున్నప్పటికీ లక్ష్మణకవిగారివి యిందులో యెన్నోవంతూ లేకపోయినా భాషా ప్రపంచంలో లక్ష్మణకవిగారు నేcటి తారలలో వొకరుగా నిల్వఁగల్గినారు. కృష్ణమూర్తిగారు వారి జీవిత కాలంలో యెంతగా ప్రకాశించినా ఒక్కపద్యం కూడా (చాటువులు తప్ప) గ్రంథాల తాలూకు కృష్ణమూర్తిగారివి నోటికి వచ్చినవారుకనుపడరు. లక్ష్మణకవిగారి రావణదమ్మీయం (చాలాచిన్న పుస్తకంలో) పద్యాలు చాలామందికి కంతోపాఠంగావచ్చును. దీనికి లంకభూమిని, అపహరించిన దమ్మన్న (ధర్మారావు) గారేకారణం. ఈపుస్తకం తప్ప లక్ష్మణకవిగారు మరియేదిన్నీ రచించినట్టులేదు. ఇదికొందరు తిట్టు కవిత్వంగా యీసడించినా మృదుమధుర పాకంలో వుంది. పేరు నిల్పింది. దీని రచనకు యీయనకు-

చ. “హయ మది సీత, పోతవసుధాధిపుఁ డారయ రావణుండు ని
     శ్చయముగ నేను రాఘవుఁడ సహ్యజ వారిధి మారుఁ డంజనా
     ప్రియ తనయుండు సింగన విభీషణుఁ డా గుడిమెట్ట లంక నా
     జయమును బోతరక్కసునిచావును నేడవనాఁడు చూడఁడీ"

అనే పద్యం (యెవరిదో జ్ఞాపకం లేదు) మార్గదర్శకం, లక్ష్మణ కవికి ఆ యీ పద్యంలో వున్న - సింగన్న పేరు కూడా తోడ్పడింది. యింతకూ చెప్పేదేమిటంటే? తగిన 'మేటరు' దొరకడంచేత లక్ష్మణ కవిగారి పేరు నిల్చేకవిత్వం వుదయించింది. కృష్ణమూర్తిగారికో అట్టి భాగ్యం పుట్టిందికాదు.

“తద్వచసైవ సార్థం విచ్ఛేదమాప భువి యస్తు కథా ప్రబంధః" అన్నాఁడు బాణమహాకవి కొడుకు.

యింతకూ లక్ష్మణకవిగారు పని పడితే ఆయుధం చూపి కార్యాన్ని సాధించేఁకవేగాని - భిక్షాటకుఁడు కాఁడని ఫలితార్థం. అయితే నాకబలి పళ్యాలకు లక్ష్మణకవిగారు వెళ్లడం