పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/24

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సుబ్బయ్య అనేపేరుగలవా రుండేవారనిన్నీ యెవరేనా తర్కంలో పేరుతెచ్చుకోవాలంటే యీత్రయాన్ని సందర్శించి వీరిమెప్పను పొందాలనిన్నీ గురువుగారు చెప్పంగా విన్నాను. యీత్రయంలో వకరు తణికెళ్లవారు, రెండు-అక్షతలవారు, మూCడు - యెవరోగాని వారి యింటి పేరు జ్ఞాపకం వచ్చిందికాదు. యీ త్రయంలో వకరు శ్రీగద్వాల సంస్థాన పండితులు అయ్యవారిపల్లెలో కృష్ణాతీరాన్ని వుండేవారు. తక్కిన యిద్దఱున్నూ బహుశః యీ మన కృష్ణాగోదావరీ తీరాలలోనే యేవో గ్రామాల్లో వుండేవారు - నాకు తపిసీలు తెలియదు. యిందులో ప్రస్తుతం గోపాల శాస్రుల్లుగారితో వాదం పెట్టందలచుకొని శ్రీ పిఠాపురంరాజావారు ఆహ్వానించిన సుబ్బన్న శాస్రుల్లుగారి శిష్యులు యించుమించు మా పరమగురువులు చర్ల బ్రహ్మయ్యశాస్రుల వారికి సమకాలికులు. వీరు కిర్లంపూడి సంస్థానమునకు సమీపంలోవున్న ధర్మవరంలో ළී బుచ్చి సీతాయమ్మగారు స్థాపించిన ధర్మపాఠశాలలో వుపాధ్యాయులుగా వుండి యెంతమందినో విద్వాంసులను చేసిన మహావిద్వాలసులు. మావిద్యార్థిదశనాఁటికి యీలాటి పాఠశాలలున్నూ యీ విద్యార్థుల పోషణకుగా యేర్పడ్డ ధర్మసత్రాలున్నూ కొన్ని వుండేవి. చదువుకోవడంవల్ల యేదో సంపాదన మనకు అవుతుందనే వుద్దేశంతో చదువుకునే ವಿದ್ಯಾಲ್ಟಿಲು ವಿನ್ಸಿಲ್ಲ నేను లేశమున్నూ యెఱుగను. చదువుకోవడం మనకు విధి అనే వుద్దేశంతోనే అప్పడు చదువుకొనేవారు. "బ్రాహ్మణేన నిష్కారణో ధర్మష్టడంగో వేదోg_ ధ్యేయో జ్ఞేయశ్చ" అనే శ్రుతికి వుదాహరణంగా వుండేది అప్పటివాళ్ల చదువు. డిగ్రీల లెక్క జ్వరం వచ్చినప్పడుకూడా అప్పడు ತೆನೆತೆಜು. అట్టి స్థితిలో చదువు కెక్కడనుండి వస్తుంది? యీ డిగ్రీలనుగూర్చి నా యిటీవలిచర్యలో కొంత వ్రాసివున్నాను - అందులోనుంచి వకపద్యం వుదాహరిస్తాను. -

తే.గీ. “ఇంగిలీషు"తో పాటుగా నిపుడు సంస్కృ
తమ్మునకుఁగూడ "డిగ్రీల తంపి వచ్చె
నట్లు "ప్యా సగువారలయం దెవండొ
తకం దక్కినవారు శుద్ధజడమతులె.

ఈ "ప్యాసు"లు కూడా చాలా తంత్రాలతో చేరివుంటాయి. అవన్నీ యిక్కడ యెత్తుకుంటే తేలదు. నూటికి ముప్బెయయిదో నలభై యో మార్కులు తెచ్చుకున్నారే అనుకుందాం. మిగిలిన మార్కు లెవరు తెచ్చియిస్తారు. అందుచేతేకాCబోలు శ్రీ కసూరి శివశంకరశాస్రుల్లుగారు "హైయస్టు" నూఱుమార్ములైతే కొందఱికి నూటపదిదాంకా వేయడం వుండేదంట! శివశంకరశాస్రుల్లగారంటే సామాన్యులుకారు. పుల్లెల దక్షిణామూర్తి శాస్రుల్లుగారుకూడా వీరివద్ద అంతోయింతో పుస్తకం పట్టినట్లు వింటాను. ఆర్డు కాలేజీలో o -