పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/235

ఈ పుట ఆమోదించబడ్డది

పదకవులు

239


దీనిలో షకార ణకారద్విత్వం వున్నప్పటికీ లోఁగడ శ్లోకంలో చూపిన గకారధకార ద్విత్వానికిన్నీ చకార రేఫద్విత్వానికిన్నీ ఖర్చయినంత ప్రాణవాయువు దీనికి ఖర్చుకాదు. అంతేకాదు ఆద్విత్వాలు సక్రమంగా పలుకవలసివస్తే యెదటివాళ్ల మొగాలు చల్లబడవలసి వస్తుంది. కనక దీన్ని గూర్చి విస్తరించనక్కరలేదు. కవిత్వ విశేషాలలో శబ్దాలంకారం కూడా వొకటి కనక ఆ శ్లోకంలో వున్న ద్విత్వఘటితాను ప్రాసాలు కవులకు అభినందనీయాలేకాని గాయకులకుమాత్రం కావని చెప్పవలసివచ్చింది. జయదేవుఁడు సంస్కృతభాషలోనే రచించినా అష్టపదులు- -

నకురు నితంబిని గమనవిలంబనం అనుసర తం హృదయేశమ్ ధీరసమీరే, యమునాతీరే||

యే జయదేవునివంటి అవతారపురుషుఁడో సంస్కృతంలో కూడా గానానుకూలంగా రచన సాగించి లోకాన్ని మెప్పించినా, సర్వసాధారణంగా తెలుఁగుభాష గానానికి అనుకూలంగాని సంస్కృతం కాదని చెప్పక తప్పదు. అందుచేతే త్యాగరాయలవారు వుభయభాషా సాహిత్యం కల మహానుభావుఁడే అయి కూడా తెలుఁగులోనే రచన సాగించి తద్ద్వారా తెలుఁగు దేశీయులనే కాకుండా అరవదేశీయులని కూడా తరింపఁజేశాcడు. (కాని అఱవవారి నోళ్లల్లో బడడంచేత ఆయన సుప్రయోగాలెన్నో గాడిద గత్తఱగామాఱి అర్థశూన్యాలు కావలసివచ్చింది,) కొంచెం వుదాహరించి వ్యాసం ఆపుతాను. 1) రామ నీ సమాన మెవరు? 2) రాముఁ దెందుఁ దాగినాఁడో 3) జగమేలే పరమాత్మ యెవరితో మొఱలిడుదు ||నగుమోము గనలేని|| 4) చక్కని రాజమార్గము లుండగ సందులు దూరనేలనే వోమనస 5) కద్దన్నవారికి కద్దు, కద్దని మొఱలిడిన పెద్దలబుద్దులు నేఁడబద్ధ మవునే ||కద్దన్న|| 6) నీనామరూపములకు నిత్యజయమంగళం 7) ఉపచారము చేసేవారున్నారని మఱవకురామ 8) శ్రీరఘువర సుగుణాలయ||

ఇన్నికృతులలో పల్లవులుదాహరిస్తే వొకదానిలో కాఁబోలును “ఘు" అనేది వత్తక్షరం దొర్లింది. అదేనా ద్విత్వంగా (వాఘ్ఘరిః) వుపయోగించే పక్షంలో గానాన్ని నిర్బంధిస్తుందిగాని కేవలంగా ఉపయోగిస్తే బాధించదు. ఆయీ విశేషం సప్తస్వర బోధకాలుగా యేర్పడ్డ అక్షరాలలో - ధ - అనేది వొకటి వుండడంవల్ల కూడా మనం తెలుసుకోవచ్చును. కాని అవసరమైనప్పుడు మహాగాయకులు ఆ ధకారాన్ని దకారం చేయడమే గాదు, షడ్జ స్వరానికి బోధకంగా వుండే - స - అనే అక్షరాన్ని - చ - అని దంత్యంగా ఉచ్చరించడం గాయకులందఱూ యెఱిఁగిందే. గానమనేదిన్నీ శృంగారమనేదిన్నీ యెంతసేపూ మార్దవాన్ని సహిస్తుందిగాని పారుష్యాన్ని సహించదు. మహాక్రూరాలుగా వుండే వ్యాఘ్రాదుల ప్రవృత్తివల్ల