పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/233

ఈ పుట ఆమోదించబడ్డది

పదకవులు

237

“ఏరీతి బొంకేవురా! లేదని నాతో" ||యేరీతి||

యీ పదంలో “వేణంగిరాయ" అనే పేరుతో కృష్ణుణ్ణి వ్యవహరించడంవల్ల యిది క్షేత్రయ్యది కాదని విస్పష్టం. నవీనులలో రంపూరి సుబ్బారావుగారంటూ వకరు వుండేవారు. ఆయన రచించిన గేయాలకు "సింహపురి జావళీలు" అనిపేరు. కొంచెం పాకం పచ్చిగావున్నా శృంగార భావాలు యీ రసికాగ్రేసరుఁడు చిత్రించి గేయవాజ్మయాన్ని పెంపొందించాcడు. యీయన కాలంలోనే గబ్బిట యజ్ఞన్న లేక యజ్ఞనారాయణగారున్నూ వుండేవారు. ఆయన రచన కూడా శ్రవణపేయంగానే వుంటుంది. శ్రీదాసు శ్రీరాములుగారు పద్యకవులై ప్రసిద్ధివహించినా, పదకవిత్వాన్ని యీసడించి వదలిపెట్టలేదు. వీరి జావళీలు కూడా తెలుఁగుదేశంలో బాగా వ్యాపించే వున్నాయి. (పూర్వం పదాలని వాడేవాట్లని యిటీవల జావళీలని వాడడం మొదలుపెట్టారు. రచనలో కూడా యీ రెంటికీ భేదం వుంటుంది) ఆయీ కాలంలోనే సుప్రసిద్ధ హరికథకులు ఆదిభట్టవారున్నూ బయలుదేరి వున్నారు. వీరు ప్రాచీనపు మట్లలోనే రచన సాగిస్తూ యెక్కువరక్తిని కలిగించే గేయాలు ఆయా కథానుగుణంగా రచించి, గేయవాజ్మయాన్ని పోషించి వున్నారు. త్యాగరాయకృతుల మోస్తరుగానే వీరి గేయాలు కూడా గురుశుశ్రూషా పూర్వకంగా అభ్యసిస్తేనే తప్ప కేవల వినికివల్ల స్వాధీన పడేవికావు. యీయన రచనను కొంచెం వుదాహరిస్తాను.

“బాలచంద్రమౌళి పాదముల్ విడక
 కాలు నోర్చి వేగమె రమ్ము కొడుక! ||బాలII

 అంగముశైత్యపైత్యము లంటనీక
 గంగాభవాని నిన్ గాపాడుగాక ||బాల||

 పవలు రేయి తాపము జెందనీక
 రవిచంద్రములు నిన్ను రక్షింత్రుగాక 11బాల||

యింకా చరణాలు కొన్ని వున్నాయేమో? యీ గేయస్వారస్యాన్ని బట్టి నాకు యెప్పుడో విన్నంత మాత్రంచేత యిది ధారణకు వచ్చింది. ఇది ఆయనగాని, ఆయన శుశ్రూష చేసిన మరికొందఱు శిష్యులుగాని పాడుతూవుంటే వొళ్లు పరవశమైపోతుంది. (యీయన రచనలో యిలాంటివి యింకా యెన్నో వున్నా "తత్రాపిచ చతుర్థో౽ంకః" అన్నట్టు నాకు యీగేయం యెక్కువగా నచ్చింది) యీయనకు సంస్కృతాంధ్రాలయందేగాక మఱికొన్ని విదేశభాషలయందుకూడా, మంచి పాండిత్యంవున్నా దాన్ని ఆయీ గేయాలలో చూపక తేలికశైలిలోనే రచించడంచేత యింతటి హాయిని కలిగించడానిక్కారణ మయిందని నేననుకుంటాను. మొత్తంమీఁద ఆలోచించిచూస్తే పండితకవి కానివ్వండి, కేవల