పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/217

ఈ పుట ఆమోదించబడ్డది

“నా౽నృషిఃకురుతేకావ్యం"

221


వారికి వారికవిత్వప్పోలికలు కొంచెం కవిత్వంలో పడక మానవు. కాళిదాసంతవాఁడికే యీవిషయం అనుల్లంఘనీయంగా కనపడితే, యితరుల మాట చెప్పేదేమిటి? ప్రాచీనంగా వుండే కవుల కవిత్వాలను అనుకరించడం అనాదిగా వున్నట్టే కనపడుతుంది గాని, కొందఱు సమకాలీనుల కవిత్వాలను కూడా అనుకరించడం మాత్రమే కాదు, తలవిఱుపుళ్లు పెట్టి, ప్రచురించుకోవడం కూడా కనపడుతుంది. గ్రంథచౌర్యంకింద అలాంటి దాన్ని చేర్చవలసి వుంటుంది. ఋష్యంశ సంభూతులైన మహాకవులెవ్వరూ యీలాటి అనుచితప్పని చేయరు. నమః కవిభ్యః.


★ ★ ★