పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

21


హోరగా జరుగుతుంది. గతించిన శ్రీ ఆనందగజపతి మహారాజులుం గారు యావజ్జీవమున్నూ తమప్రభుత్వానికి సివిల్ మాజ స్టేటు అధికార సంపాదన కోసమె యత్నించి తుదకు కృతకృత్యులు కాలేదని వింటాము. వీరట్టి ప్రయత్నం చేసినట్లు లేదుగాని స్వయంగానే సాంగించుకున్నారు.

వక గవర్నమెంటు వుద్యోగి

వక గవర్నమెంటు వుద్యోగికూడా వీరి ఆగ్రహానికి యెఱకావడం తటస్థించిందంట. అది లోలోపల మాసిపోక పై అధికార్ల నోటీసుదాంకా వెళ్లి, తుదకు ఆ వుద్యోగి శృంగార ప్రియుండు కనుక ఆయన ప్రియురాలికి పదిహేనువేల రూపాయీలు యివ్వడానికిన్నీ ఆ వుద్యోగి మొదటతన్ను రాజావారు కొట్టినట్టుచెప్పి యిప్పడు అన్యథాగా చెప్పడంవల్ల వుద్యోగం పోవడం తటస్థిస్తుందిగనక ఆ విషయంకూడా ఆలోచించందగ్గదే అవడంచేత ఆయనకు యావజ్జీవమున్నూ వుదయ వరహా లివ్వడానికిన్నీ యేర్పఱచి ఆ చిక్కులోనుంచి తప్పించుకొన్నట్లు మా తండ్రి గారివల్లనే వినివున్నాను. యింత తపిసీలుగా మా తండ్రిగారికి తెలియడానిక్కారణం:- ఆ వుద్యోగి మా గ్రామం వచ్చినప్పడు మా పశువుల పాకలో మకాంచేసేవారంట. యేంకర్మం, గ్రామంలో బసేదొరికేదికాదా అంటే, ఆయన దాసీప్రియురాలి సహితంగా వస్తే యే గృహస్థింట్లో బసదొరుకుతుంది? వారు అడగా అడగరు. అప్పటి కాలాన్నిబట్టి గృహసులు యివ్వా యివ్వరుకదా? మాతాతగారికి వ్యవసాయం విస్తరించి వుండడంవల్ల, గవర్నమెంటు అధికారిగదా ఆయనతో యెప్పుడేంపని పడుతుందో అని ముందాలోచనచేసి, యింటికి కొంతదూరంలోఉన్న పశువులపాక బాగుచేయించి, ఆ నాలుగు రోజులున్నూ పశువులను యితరత్ర కట్టుకొనే వారంట! అందుచేత యీ రాయబారాలు యావత్తున్నూ మా యింట్లోనే జరగడంచేత మా తండ్రిగారికి బాగా తెలియడానికి కారణమయింది.

గురు శిష్యభావపు వాడితనం

యింతకూ ప్రధానాంశం రాజావారికి గురువుగారి విషయమై పట్టరాని కోపంవచ్చింది. యితరవిషయమైతే యేం జరిగేదో? గురువిషయం కదా? వారి ప్రవర్తన మేలావున్నా శిష్యులు ఆక్షేపించడానికి అవకాశం లేనట్లు, శాస్త్రాలు ఫరోషిస్తూవున్నాయి. రాజావారు పూర్వాచార పరాయణులు. మంచి శ్రుతపాండిత్యం కలవారు. గురువుల విషయంలో తొందర పడతారా? లేదా, మరి యిచ్చచొప్పున లక్షా కుమ్మరిస్తారా పాదపూజకింద? యీ మధ్యనే రాజమండ్రిలో జరిగిందని విన్నాను - వక సంపన్న - ^