పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/161

ఈ పుట ఆమోదించబడ్డది

ఆచారభేదాలు

165


నూటికి తొంభైపాళ్లు లోపించింది. ఆ స్థానానికి కాఫీ లేదా, టీ ఆదేశంగా ప్రవేశించింది. పైలకాపు కుర్రలదగ్గిరనుంచీ పొగాకు చుట్ట కాల్చడానికి బదులు సిగరెట్లు వ్యాపించాయి. ఆశ్చర్యం వేస్తుంది. సాలుకు పాతికో ముప్పయ్యో రూపాయలు వ్యయించి యే దినపత్రికనో తెప్పించుకుంటే దానిలో చెరిసగం, సిగరెట్ల అడ్వర్టేజుమెంటో, లేదా సబ్బు అడ్వర్టేజుమెంటో తప్ప యితరం కనపడదు. సబ్బుదానిలో తారలు కనపడతారు. చూచి యువకులు ఆనందిస్తారు. అందుకుగా వ్రాసిన మాటలకు అర్థం తెలుస్తుంది. కాని సిగరెట్లదానిలో వుండే బొమ్మలకు, అర్థం మాబోట్లకు గోచరించదు. రేషనింగు బియ్యానికి పెడుతున్నారు గాని సిగరెట్లకు పెడుతూవున్నట్టు ෂීක. దారిద్ర్య కారణంచేతనూ కరువు చేతనూ ఆరోజు కడుపుకు అన్నం లేకపోయినా సినిమా ఖర్చు తప్పదు. గాంధీగారు రాట్నం వొడుక్కోవడాన్ని బోధిస్తారుగాని సినిమాఖర్చు తగ్గించుకోండని గాని సిగరెట్లుమానండని కాని బోధించరు. అంతమాత్రంచేత మహాత్మునికి ఆ యీ దుర్వ్యయాలిష్టమనికాదు. ఆయన బోధించే విషయాలన్నీ సంసారుల శ్రేయస్సుకు వుపకరించేవే కాని వినేదెవ్వరు? అందులోనల్లా వొక్క అస్పృశ్యతను గూర్చిన బోధ మాత్రమే అమల్లో పెడతారని తోస్తోంది. యెందుచేతంటే? దానికి చేతిడబ్బువదలదు కనుక. భగవంతుడవతరించి బోధించినా యీ దేశానికి మంచిరోజు లున్నట్టు తోcచదు.

మొదటి యుద్ధానంతరం ఫ్రాన్సు దేశంలో జనాభా తగ్గిందనే కారణముచేత, దాన్ని పూర్తిచేయడానికి ఆడవాళ్లందఱూ సంతానం (ఏవిధంగా నేనాసరే) కనితీరవలసిందే అని శాసనం చేశారు. పాపం? అంతకుమున్ను మతవ్యాప్తిన్నీ ధర్మవైద్యమున్నూ చేసే బ్రహ్మచారిణులు (నన్సు) దేశం వదలిపోనేనాపోవాలి. లేదా సంతానమేనాకనాలి. అని చెప్పుకున్నారు. కొందఱు స్త్రీలు కేవలం గొడ్డుతాళ్లుగానే సృజింపబడతారు. అనేకులతో చుట్టఱికం వుండిన్నీ ఆబాపతు స్త్రీలు "పద్మపత్రమివాంభసా” అన్న గీతా వాక్యానికి వుదాహరణంగా వుంటారు. యీలాటి కఱువులుకోటి వచ్చినా వాళ్ల భర్తలకు చిక్కులేదు. యెప్పటికీ లింగీలింగడే గదా? ఆ శాసనం ఆ స్త్రీలపట్ల యేలా అమలు జరిగిందో తెలుసుకోలేదు.

మన భరతఖండంలో యే యే ఆచారాలు హేయంగా మనం భావిస్తామో, అవసరమయితే అవన్నీ యూరపుఖండం నిరాఘాటంగా ఆమోదిస్తుంది. ఆఖండవాసులతో యీ ఖండవాసులు దేనికీ పోటీచేసి నెగ్గలేరు. యీ ఖండం యెప్పటికేనా బాగుపడాలంటే వారి నాగరికతకు వొకదణ్ణం పెట్టి వర్తించడమే మార్గం. ఆయీ మాటకు యితర