పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/153

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణశాఖలు

157


వళహలలో నూటికొకరేనా ఉంటారుగాని తెళహలలో వుంటారో లేదో? పుస్తకాపేక్షే దివ్యదేశాలలో చాలా నికృష్టంగా చూస్తారు. వీరు కూడా వారిని అదేవిధంగా చూడాలను కొన్నావారు వీరికి చిక్కరు. వారు శివాలయంలోకి యెన్నడూ రానేరారని వ్రాయనక్కఱలేదు. మానవులందఱినీ తరింపజేయడానికి అవతరించినట్లు విశ్వసించడానికి శిష్యసంచారమే సాక్ష్యమిస్తుంది గాని, అది నానాటికి యేదో విధంగా పరిణమించి ప్రకృతం కొనవూపిరితో కూడా వుందనడానికి ధైర్యంలేదు. అద్వైతులకన్నా ద్వైతులకన్నా వీరు నిమ్నజాతులకు తరణోపాయం చూపడంలో వుదారులు. ఆళ్వారులలో కొందఱు అంత్యజలేవున్నారు. వీరిలో యతీశ్వరులున్నారు. (రామానుజులవారు యతిరాజులే కదా? కాని, అద్వైతసన్న్యాసానికీ, వీరి సన్న్యాసానికీ యేతాంపెట్టుగా వుంటుంది. యితరమతస్థులు (స్మార్తులు వగైరా) చట్టన పాశ్చాత్యనాగరికతకు లొంగి మాఱినా, వీరుమాత్రం మతచిహ్నలింకా పరిత్యజించలేదనేది చాలా అభినందనీయం. క్రాఫింగువగైరాలు వీరిలో నూటికి 99 మందికి లేవనే చెప్పవచ్చు. పాండిత్యాన్ని వేషంచేత భూషించడం వీరికి తెలిసినట్లు యితరులకు తెలియనే తెలియదు. యితరులలో పాండిత్యం హెచ్చిన కొద్దీ వేషం తగ్గుతూంది వీరిలో వేషమూ హెచ్చుతుంది.

శ్రీమాన్ పరవస్తు రంగాచార్యులయ్యవార్లంగారు విజయనగర సంస్థానానికి ఆయీ కారణం చేతనే వెళ్లలేదని మా పరమగురువులవల్ల విన్నాను. కొంచెం వివరిస్తాను: అయ్యవార్లంగారు కోటలోకి సవారీమీద వెళ్లడమూ, ద్వారం దాటిన పిమ్మట సవారీ దిగి పావుకోళ్ళతో సభాస్థానందాకా వెళ్లడమూ సభలో వారి స్వంత చిత్రాసనంమీద కూర్చుండడం ఆచారం. మహారాజావారు సవారీ మర్యాదకు అంగీకరించారుగాని తక్కిన దానికి అంగీకరించలేదు. కారణం యేమిటంటే: అది వారి ఆస్థానపండితులకు అవమానకర మన్నారు. ఆలాగయితే మీ సంస్థానానికి మేము రానే రామన్నారు (తృణీకృత బ్రహ్మపురందరులు) ఆచార్లుగారు. మహారాజా వారు మీ చిత్తం అని వూరుకున్నారు. యివన్నీ యిప్పటివారికి యేదో విధంగా కనపడతాయి. యించుమించుకు తత్త్వాలకు సంబంధించిన మర్యాదలవంటివే యివి. యిప్పడు దొడ్డితుడిచే వ్యక్తికికూడా గారు పదం చివరతగులుస్తూ వున్నాం. ఆలా తగల్చకపోతేనో? "డిఫర్‌మేషన్" దాఖలయిందన్నమాటే.

యేదో స్వల్పంగా వ్రాయడానికి ఆరంభించి అవాంతరసందర్భాలవల్ల కొంత పెరిగి పెద్దదయింది. యెన్నో సంగతి సందర్భాలు యింకా వ్రాయవలసినవి వున్నాయిగాని వోపిక లేక యింతతో ముగిస్తున్నాను.


★ ★ ★