పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/151

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణశాఖలు

155


పరమోత్కృష్టమైన కార్యమే అయినా అది ప్రతిఫలశూన్యంగా వుండాలి కాని, అన్యథాగా అయితే దానికి గౌరవం లేకపోవడమేకాక, దేవలకత్వాన్ని సంఘటిస్తుందనిన్నీ ఆ దేవలకత్వం పాంక్తేయత్వానికి భంజకమనిన్నీ ధర్మశాస్త్రకర్తలు ఋషిపుంగవులు నిర్వచించి వున్నారు.

యిక నల్లామిగిలినవారు ఆంధ్రదేశీయులలో (1) విశ్వబ్రాహ్మలు (2) దేవ బ్రాహ్మలు, (3) కళింగబ్రాహ్మలు - యీ మూడు తెగలవారూ కనపడతారు. వీరిలో నెంబరు వన్‌వారు కృష్ణా, గోదావరి, గుంటూరు, మండలవాస్తవ్యులు. యావన్మందీ ఆహార విషయంలోనూ సదాచార సంపత్తిలోనూ బ్రాహ్మణులతోపాటుగానే వుంటారు. వారిలో వారికే యెన్నో సందర్భాలు కుదిరితేగాని పంక్తిభోజనాలు సందర్భించనప్పుడు యితరులతో సందర్భించవని వ్రాయవలసి యుండదు. రెండో నెంబరు వారిలో యెవరోతప్ప తక్కినవారు మత్స్యభుక్కులే కాక మాంసభుక్కులు కూడా అని చెప్పగావినడం. మూడోనెంబరువారు తూర్పున సికాకుళం ప్రాంతంలోవున్నారు. వీరి బ్రాహ్మణ్యాన్ని గురించి మనకు బాగా తెలియదు, వోఢ్ర బ్రాహ్మణ్యానికి సంబంధించి వీరి ఆచారాలు వుంటాయని తోస్తుంది. యిక్కడికి, శ్లోకములో వున్న వొకటి రెండు నెంబర్లను గూర్చి యే కొంచెమో వ్యాకరించినట్లుయింది.

యిక కర్ణాటకులను గూర్చి వ్రాయాలి. వీరందఱూ ద్వైతమతస్టులు. మాధ్వులని వీరికి నామాంతరం. వీరిలోనూ వైదీకులున్నారు. వారు ఆచార్యపదంతో వ్యవహరించ బడతారు. లౌకికులు పంతులు పదంతో వ్యవహరింపబడతారు. బ్రాహ్మణజాతిలో మొట్టమొదట లౌకికోద్యోగాలలో ప్రవేశించినవారు వీరే. వ్యాపారులు అనేపేరు వీరికి ఆకారణంచేతనే వచ్చి వుంటుంది. వీరికి అద్వైతులంటే చాలాద్వేషం. అది మతవిషయం లోనే. యితరత్ర వారూ వీరూ మమేకంగానే వుంటారు. చాలా భాగం లౌకికులే కావడంచేత యేమాత్రం వైదికవిద్యాప్రవేశం వున్నా ఆ వ్యక్తికి వీరిచ్చే గౌరవం అపారం.

"అబ్రవీ త్పురాణగాథ" వీరు పూజించే స్వశాఖాపండితులను గూర్చి ప్రతిపక్షులైన స్మార్తపండితులు కల్పించిందే. వీరిలో యితర శాస్త్రాలకన్నా తర్కశాస్త్రం చదివిన విద్వాంసు లధికంగా వుంటారు. వీరి వేదాంతం చాలా భాగం ఆశాస్త్రాన్ని పురస్కరించుకొని వుంటుంది. జగత్ర్పసిద్దులగు భీమాచార్ల్యులవారు ఈ శాఖీయులే.

వీరిలో అవాంతరభేదాలు నాకు బాగా తెలియవుగాని లోకైకప్రసిద్ధతార్కికులు కీ||శే||లు శ్రీకర్ణాట సీతారామశాస్త్రుల్లుగారుకూడా యీ శాఖలో అవాంతరీయులే కావాలి. వీరిలో స్మార్తులలో మాదిరిగా గ్రామపురోహితులు లోనైనవారు లేకపోలేదుగాని బాహుళ్యంమీద లౌకికులే హెచ్చు. పంతుల పఠాణీవేషాలు అనే పాత్రద్వయంలో వున్నపంతులు యీశాఖవారే. బ్రాహ్మణులు నాగరీకం ముదిరితే వుండే విశేషాలు ఆవేషాలవల్ల సులువుగా