పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/143

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణశాఖలు

147

యీ సోమయాజులుగారు, అప్పరాయ యశశ్చంద్రోదయం అనే అలంకార గ్రంథం కూడా రచించారు. యీయనకవిత్వం అగ్రహారాలు చాలా సంపాదించింది. ఆఖరు వయస్సులో పెద్దాపుర సంస్థానంవారు వీరికి అగ్రహారం యిస్తూవుండగా మంత్రి పాణంకిపల్లి రామచంద్రుడుగారు చెడగొట్టినట్టు చెప్పుకుంటారు. దానికి కారణం రామచంద్రుడుగారు సోమయాజులు గారిని విందుకు ఆహ్వానిస్తే యాజులుగారు అంగీకరించపోవడమే. సోమయాజులువారు యితరులు వండినది యేలాగూ తినరు. అందుకు దివానుగారికి కోపంరాలేదు. "అయ్యా! మీరు చేసుకునే స్వహస్తపాకం, మాగృహంలో, మాపదార్థంతో చేసుకుంటే మాకు సంతుష్టి. తద్ద్వారా మా పెద్దలు తరిస్తారు మేమూ తరిస్తాం” అని ప్రాధేయపడితేకూడా సోమయాజులుగారు, దానిలో యేం లోపంవస్తుందో వైదీకానికి? అందుకుకూడా వు, హు, ససేమిరా, అని ఛాందసంగా బిఱ్ఱబిగియడంచేత రామచంద్రుడు గారికి వొళ్లుమండి ఆయీ అపకారం చేసినట్లు చెప్పకుంటారు. కత్తిపోటుకన్నా కలంపోటు మిన్నగా పనిచేస్తుందన్నమాట వూరికే పుట్టలేదు. ఆయీమాటను ప్రస్తుతగాథ వ్యాఖ్యానిస్తుంది. సోమయాజులుగారు రాజుగారి మీద, కంకణబంధం కాబోలును రచిస్తే దానికి రాజుగారు సంతసించి మీకేంకావాలీ, కోరుకోవలసిందని అడిగారనిన్నీ దానిమీద సోమయాజులు గారు వారి గ్రామం కాకరపర్తికి అతిసమీపంలో వసిష్ఠానదికి తూర్పువొడ్డున వున్న గౌతమీవసిష్ఠా మధ్యస్థం నారికెలమిల్లి గ్రామాన్ని అగ్రహారంగా కోరారనిన్నీ రాజుగారు దివానుగారిని పిలిపించి దానపట్టా వ్రాయవలసిందనేటప్పటికి లోగడ జరిగిన విందుప్రసక్తి మనస్సులో వుండడంచేత మంత్రి రాజుగారితో- "అయ్యా నెలరోజులలో గొప్ప సూర్యగ్రహణం రానైవుంది, ఆ గ్రహణకాలంలో యీలాటి దానాలు యివ్వడం కోటి గుణితంగా యీలాటి పండితులే సెలవిస్తారు కనక అప్పుడు మనం అక్కడికి వెళ్లి ఆ వసిష్ఠలోనో, గౌతమిలోనో, స్నానంచేసి యీ దానంచేస్తే బాగుంటుందేమో? సోమయాజులు గారితో సంప్రతించవలసి"నదని కడు వినయవిధేయతలతో మనవి చేసేటప్పటికి, మంత్రిగారి మాట టక్కున టంకప్పొడిలాగ అతుక్కోవడంచేత “మహాబాగా వుందోయి రామచంద్రుడూ! నీ మాట” అని రాజుగారు సమ్మతించి అప్పటికి ఆ ప్రయత్నం విరమించారనిన్నీ పిమ్మట గ్రహణమైతే వచ్చింది, రాజుగారు స్నానానికి ఆ ప్రదేశానికి దయచేసి వెళ్లీవెళ్లడంతోనే సోమయాజులు గారినైతే ఆహ్వానించడానికి యెవరినో పంపడంమట్టుకు జరిగింది; కాని అప్పటికి చాలా వృద్ధాప్యంలోవున్న సోమయాజులుగారు స్వర్గంలో-రంభగారి లోగిట్లో వున్నట్లు తెలిసి అన్నా యెంతమోసం జరిగింది అని రాజుగారు విచారిస్తూ- “అన్నా! రామచంద్రుడూ? పాపం మూటకట్టుకున్నావు గదా;" అని మృదువుగా - మందలించా రనిన్నీ చెప్పకోగా వినడం. ఆ యా వేంకటసోమయాజులుంగారే కూచిమంచి