పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/139

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణశాఖలు

"భూమిన్ బ్రాహ్మణశాఖలం దొకటియై పొల్పొందు నెంతేని నారామద్రామిడశాఖ. భారద్వాజ గోత్రమ్మునన్"

"తనకుమాలిన ధర్మంలేదు" కనక ముందుగా మాశాఖపేరు చెప్పుకున్నాను. ఆయీ పద్యంలో “ఎంతేని నారామ" అనే దానిలోవున్న సంధినిగూర్చి ప్రస్తుతం అంతగా ప్రసక్తి లేకపోయినా అవకాశాన్నిబట్టి జిజ్ఞాసువుల కొఱకు వ్యాసాంతమందు కొంత చర్చిస్తాను. ద్రవిడ, ద్రమిడ అనే రూపాలు రెండూవున్నాయి గనక ఆశబ్దం శంకించవలసి వుండదు. ఆ యీ "బ్రాహ్మణశాఖలు” అవాంతరాలు కాక ముఖ్యమైనవి పది యేదో వ్యాసంలో"ఆంధ్రద్రవిడ కర్ణాట మరాటా ఘూర్జరాస్తథా సారస్వతాః కాన్యకుబ్జా గౌడా ఉత్కల మైథిలాః"

ఆ యీశ్లోకం వుదాహరించినట్లే జ్ఞాపకం. యిందులో, తథా అనే రెండక్షరాలూ తప్ప తక్కినపదాలన్నీ “బ్రాహ్మణశాఖల” నామధేయాలు, వీట్లని రెండుగా విభజిస్తే పంచద్రావిళ్లూ పంచగౌడలూ అని తేలుతుంది. గౌడలలోవుండే అవాంతరభేదాలు ఆదేశ వాస్తవ్యులకు తెలిసినట్లు తదితరులకు తెలియవు కనక దానిజోలికి పోయేదిలేదు. బాగా తెలియని విషయం పెట్టుకొని అపహాస్యాస్పదుణ్ణి కావడం కంటె తూష్ణీంభావమే యుక్తం. యింకనల్లా- “పంచద్రావిళ్లు" మిగులుతారు. యిందులోకూడా అవాంతరంగావున్న ద్రవిడశాఖను గూర్చి దాక్షిణ్యాత్యులకు తెలిసినట్లు మనకు తెలియదు. -

"పంచద్రావిళ్లు"లో అవాంతరంగా ద్రవిడులున్నట్లే - పంచగౌడలలో కూడా గౌడలున్నట్లు పయిశ్లోకం తెలుపుతూనే వుంది. సరే; మొదటివారిలో మైసూరు ప్రాంతంలోవుండే కర్ణాటకులలో ఉండే అవాంతరభేదాలుగాని, మరాటులలోనూ ఘూర్జరులలోనూవుండే అవాంతరభేదాలుగాని మనకుబాగా తెలియవు. కనకవారిని కూడా వ్రాసేదిలేదు.ఆ సందర్భాన్ని తెలిపే పుస్తకాలు కూడా వున్నట్లు గోచరింపదు. మహారాష్ట్రులు ఆయుధ జీవులన్నంత వఱకు పాణినీయసూత్రంవల్ల గోచరిస్తుంది. దానికి తథ్యంగా కొంతకాలం వారురాజ్యాన్ని పాలించారు- “పుబ్బలో పుట్టి, మఖలో మాడింది” రాజ్యం యెప్పడూ ఆయుధబలాన్ని పురస్కరించుకొని వుంటుంది. "వీరభోజ్యము సుమ్ము రాజ్యము" "దెబ్బకు దెయ్యం జంకుతుంది" యితరులనుపట్టి పీడించే పిశాచాలుకూడా ఆయుధానికి