పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/113

ఈ పుట ఆమోదించబడ్డది

భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా?

117

శూరుండుగాని, పండితుండుగాని అంతగా గణనీయుండు కాడనియ్యేవే ఆయా కవుల తాత్పర్యం. గురు శిష్యుల విషయంకూడా యీలాగే చూచుకోవలసి వుంటుందని మురారి మహాకవి ప్రవృత్తివల్ల గోచరిస్తుంది. పరశురాముండుకూడా భీష్ముని విషయంలో యీ అంబా ప్రసక్తిదాంకా మంచి హృదయంతోటే వుండేవాండు. ఆసందర్భం యీ పద్యం చెపుతుంది.

మ. విలువిద్దెం బలుమంది కిచ్చితిని మీ పృథ్వీశులందేమి పా
అులయందేమి నినున్ బలెన్మదికి నేరున్ మోదమున్ గూర్చరీ
యిలనిన్నున్ బలెం గీర్తికిన్ దెరువులై యేపారం బో రొక్కరున్
గలిగెన్నాకు భవద్వశంబున యశఃకల్యాణ లీలాగతుల్."

యేదో హేతువు కలిగేదాంకా హృదయం యెవ్వరికీ మంచిగానే వుంటుంది. హేతువు కలిగినప్పడుకూడా హృదయం చెడకుండా వుంటేనే అది కవివర్ణ్యం అవుతుంది. హేతువు కలిగినపుడేనా పరశురాముఁడు యుద్ధానికి రమ్మన్నాండు కాని అంతకంటె అనుచితమైన సంభాషణ లేశమున్నూ చేయలేదు. ముఖ్యంగా యీ అంశం మనం గమనించాలి. యుద్ధంలోనేనా పరశురాముఁడు సుఖసుఖాల వోడేవాఁడు కాండు. కాని బొత్తిగ తనకు తెలియని మోహనాస్త్రం వకటి శిష్యుండికి తెలియటంచేత వోడిపోవలసి వచ్చింది. బహుశః అది యిప్పటి విషవాయు ప్రయోగం వంటి దనుకుంటాను. అప్పుడు మాంత్రికాలన్నీ నేcడు తాంత్రికాలుగా మాటి మన కాయా పురాణ వాక్యాలయందు విశ్వాసాన్ని కల్పిస్తూవున్నాయి. ఇటువంటివే లేకపోతే ఇప్పటివారిలో అనేకులు పురాణాలన్నీ పుక్కిటిగాథలే అనటానికి సందేహం వుండదు. పురాణాలలో కొన్ని అర్థవాదాలు లేకపోలేదు. గాని అన్నీమాత్రం అర్థవాదాలుకావు. అర్థవాదమంటే దేన్నోబల పఱచడానికి యేదోవకకథ కల్పించి చెప్పడం. సత్యాన్ని బలపఱచడానికి వూరికే “సత్యం వద"అని బోధించడంకంటె, హరిశ్చంద్రోపాఖ్యానంద్వారాగా బోధిస్తే బాగా వంటపడుతుందికదా! ప్రతివిషయంలో నున్నూ యిట్టివున్నాయి. సంగీతంలో యేదో వకరాగానికి స్వరాలు “రిగపధసా” అని వున్నాయనుకోండి. ఆ అక్షరాలు అయిదున్నూ వుపదేశించి వూరుకుంటే శిష్యుండికి బాగా తెలియదు. దాన్ని వక వర్ణంద్వారాగానున్నూ, కృతిద్వారాగానున్నూ బలపరిస్తే ఆరాగం బాగా శిష్యుండికి వంటపడుతుంది. యీ అర్థవాదాల మతంలో కథలన్నీ కల్పనకిందకే వస్తాయి. ప్రస్తుతం మనం యేకథను గూర్చి ముచ్చటించుకున్నామో ఆ కథానాయకుండు భీష్ముండుగాని ఆయన గురువుపరశురాముండుకాని మరికొన్ని పాత్రలు యీకథకు సంబంధించిన యితరాలుగాని లేనేలేవనుకోవాలి. అట్టే చెప్పేదేమిటి? “గజంమిథ్య