పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/111

ఈ పుట ఆమోదించబడ్డది

భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా?

115

చెప్పేమాటలు గురువుకూ, శిష్యుండికి చెప్పేమాటలు శిష్యుండికి చెప్పి యెట్లాగయితే యేమి రాజీచేశారు. ఈ యుద్ధానికి కారణ భూతురాలైన అంబనే శిఖండిపదంతోటి ఇటీవల భారతంలో వాడింది. ఈలాటి అకార్యాన్ని పురికొల్పిందని కాంబోలు ఈశిఖండి పదం లోకంలో తిట్టుగాకూడా యిటీవల మాటింది. "గండా మొండి శిఖండి బండలకు లెక్కల్లేని నాల్కల్గదా!" లోనైన వాటివల్ల పైసంగతి తేలుతుంది. వూరికే అంబను దూషిస్తారుగాని నిజానికి లోపమంతా పరశురాములదే. అయితేనేమిగాక! పరశురాముండు నిజమైన శూరాగ్రేసరుండవడంచేత శిష్యుండి ప్రజ్ఞకు సంతోషించాండు, కౌగిలించుకున్నాడు ఆశీర్వదించాడు కూడాను. భీష్ముండు తనకు జయం కలుగుతూ వున్నప్పటికీ యీ జయం జయంకింద చూచుకోకూడదని యొఱింగినవాండవడంచేత నారదుండున్నూ తనతల్లి గంగాదేవిన్నీ చెప్పిననీతికి ప్రతిచెప్పక అంగీకరించి పరశురాముండిదగ్గరకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాండు, క్షమాపణ చెప్పాండు. జయలక్ష్మీ శోభితుండై కూడా వినయ వినమితుండైన శిష్యుణ్ణి యెంతగౌరవించాలో అంతా గౌరవించి పరశురాముండు ఆదరించాండు. పరశురామునితో గంగ చెప్పే వుపశమనవాక్యాలలో కొంచెం తన కొడుకు ప్రవర్తనకు అనుకూలంగానే స్ఫురించేటట్టు మాట్లాడింది. ఆమాటలు వుదాహరిస్తాను.

"నీ శిష్యుండు దేవవ్రతుండు, వానియెడ నలుగందగునే? వాండు తగవు మాలినపనిఁ జేయంజాలక పెనంగె, నింతియుకాని విరోధిగాండు."

పైమాటలవల్ల లోపమంతా గురువుగారియందే వుందని గంగ తేల్చినట్లయింది. అయినప్పటికీ యథార్థం వప్పుకోవడం సజ్జనలక్షణమున్నూ, శూరలక్షణమున్నూ కనక పరశురాములు ప్రతి చెప్పక చట్టన శిష్యుణ్ణి ఆదరించి బుజ్జగించాడు. గురువుగారి ఆజ్ఞను శిరసావహించి భీష్మండు యుద్ధానికి సిద్ధపడ్డాండు గనుక ఆయి చరిత్ర లోకంచేత యింతగా మన్నించంబడుతూవుంది, కాని భీష్ముండు యుద్ధానికి వెనుతీయడమే జరిగితే ఆ యీచరిత్రకు లేశమున్నూ గౌరవమే లేకపోయేది. యితరులమాటెందుకు? పరశురాములుకూడా "అయ్యో! యేలాటి పిటికిపంద నాకు శిష్యుండైనాఁడని తనలో తాను సిగ్గుపడేవాఁడు. శూరత్వప్రసక్తి వచ్చినప్పుడు గురుశిష్యులేకాదు, పితాపుత్రులే కాదు తమ తమ ప్రజ్ఞావిశేషానికి ప్రాధాన్యం యివ్వవలసిందే. కాని బంధుత్వానికి ప్రాధాన్యం యివ్వడానికి అవకాశం లేదని లోకానికి యీ చరిత్రేకాదు, అర్జున బభ్రువాహనుల చరిత్రకూడా చెపుతూవుంది. బభ్రువాహనుండు యెంతో వినయంగా దర్శనానికి వచ్చి నమస్కరిస్తే అర్జునుండేలాటి జవాబు చెప్పినాండోచూడండి -