పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/107

ఈ పుట ఆమోదించబడ్డది



భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా?

భీష్మణ్ణి గురించి నాలుగుమాటలు వ్రాస్తాను. భారతంలో యితని చరిత్ర సమగ్రంగా వున్నప్పటికీ అక్కడక్కడ వెదికితేనే తప్ప వొకటే చోట వుపలబ్ధం కాదు. యితఁడు శంతన మహారాజుకున్నూ గంగా దేవికిన్నీ జన్మించినవాఁడు. గంగ వొకానొకనది కదా! ఆ నదికిన్నీ మనుష్యుడైన శంతనుండికిన్నీ దాంపత్యం యెట్లా? అంటూ శంకిస్తే జవాబు చెప్పవలసింది లేదు. యిలాటి దాంపత్యాలు మన ఆర్యుల చరిత్రల్లో చాలా వున్నాయి. శ్రీ కృష్ణమూర్తికి కాళింది భార్యకావడం వగయిరాలు చూచుకోండి. వసుమహారాజుభార్య గిరికాదేవికూడా నదీసంతానమే. కాని అక్కడ ఆశుక్తిమతీనదికి భర్త మనుష్యండుకాఁడు; కోలాహల పర్వతం. కనక యింత విరుద్ధంగా వుండదు ఆ కథ.

రెండున్నూ జడపదార్థాలే. వస్తుతః మన ఆర్యుల మతంలో కుల పర్వతాలుగాని, మహానదులుగాని కేవల జడపదార్థాలు కావనిన్నీ వీటికి అంతరాత్మ దేవతగా వుంటుందనిన్నీ నిశ్చయింపCబడినట్లు తేలుతుంది.

"శ్లో అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయః."

అంటూ కాళిదాసంతటి మహాకవి చెప్పడం సాధారణంగా తటస్థించదుకదా! కాళిదాసు పరిశీలన సామాన్యమైనదంటే ప్రాజ్ఞలెవ్వరూ విశ్వసించరని వేటే చెప్పవలసి వుండదు. కాCబట్టి సూర్యచంద్రాది ఖగోళస్థ పదార్థములేమి, నదీపర్వతాది భూగోళస్థ పదార్థములేమి కేవలజడములుగా సామాన్యదృష్టికి గోచరించినప్పటికీ విశేషజ్ఞల దృష్టిలో వీటికన్నిటికిన్నీ అంతరాత్మ వుండడం సిద్ధాంతమే. కర్ణుండు సూర్యపుత్రుండైనట్లే భీష్ముండు గంగా పుత్రుండే. ఒకచోట తల్లి మానుషి తండ్రి దేవత, వేటొకచోటో తండ్రి మనుష్యుండు తల్లి దేవనది. భీష్ముడు తల్లివద్దనే బాల్యంలో పెంపcబడ్డాడు. యేలా పెంచిందో యేలా పెరిగాడో వివరించడానికి భారతంలో కూడా తగినంత ఆధారం కనపడడంలేదు. తల్లిద్వారాగానే వసిషుణ్ణి శుశ్రూషించి వేదాదికాన్ని అభ్యసించాడు. పరశురాముణ్ణి శుశ్రూషించి ధనుర్వేదాన్ని అభ్యసించాడు. భీష్ముండికి తెలిసినధనుర్విద్యలో వక్కమోహనాస్త్రం తప్ప