పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

106

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

చేరిన యీ తాగుడు పూర్వకాలంలో అగ్రజాతుల్లో లేనేలేదని చెప్పడానికి సందేహం లేదుగాని యిటీవల పడమటిగాలి సోకిన తరవాత దీనికి అగ్రజాతులేమి జమీందార్లేమి పూర్తిగా అలవాటు పడ్డారు. యెంతో యోగ్యులైన జమీందార్లు, ప్లీడర్లు - వకరేమిటి? ఐశ్వర్యం వున్నవాళ్లు చాలామంది దీనివల్ల మానప్రాణాలు గోలుపోవడం నేను కళ్లారా చూచివున్నాను. వారివారి పేళ్లు యిందుదాహరించడం న్యాయంకాదు. కాcబట్టి వుదాహరించలేదు, పాణిగృహీతలోవకపద్యం దీన్ని గూర్చి వ్రాయంబడింది. దాని వుదాహరిస్తాను. ---

శా. "అన్నా వైనంట! బ్రాందియంట! విసికీ యం టక్కటా! నీకునీ
విన్నాణం బెటు లబ్బెరా? ద్విజకులావిర్భూతియున్ బానమున్
మున్నెచ్చో వినలేదు నీదుతలనే మున్జెన్ మహాపాప; ము
చ్ఛిన్నం బయ్యెఁ గులమ్మ నీకతన సీ! సీ! గోత్రవిధ్వంసకా!"

యజ్ఞయాగాదులు చేసిన సత్కులమందు పుట్టి పైపద్యానికి ప్రథమ లక్ష్యంగామాటిన పాశ్చాత్యవాసనావాసితు లెందలో మనదేశంలో వున్నారు. యీ మద్యపాననిషేధం గనక తుదనెగ్గితే అట్టివారంతా మంచి స్థితికి వస్తారనడానికి సందేహం లేదు.

మద్యపానం నశించడానిక్కూడా యుక్తాయుక్తజ్ఞానమే. అట్టి యుక్తాయుక్తజ్ఞానం ప్రతిమానవవ్యక్తికిన్నీ కలిగించాలంటే అది కష్టసాధ్యమే కాదు. కేవలమూ అసాధ్యమే అన్నమాట. అందుచేతే గాంధీ మహాత్ముండు నిర్బంధవిధానాన్ని మద్యపానం విషయంలో అవలంబింపచేసేటట్టు తోస్తుంది. నిర్బంధవిధానమంటే? అసలు ఆమద్య పదార్థవ్యత్పత్తినే ఆటంకపఱచడం. యిదికొంత అనాలోచనగానున్నూ వుంటుంది గాని గాంధీమహాత్ముని వంటి మహాఋషి-పైCగా రాజకీయనీతి ధురంధరుడు- మొదలు పెట్టినదాన్ని కాదనడానికి మనబోట్ల కధికారం లేదనుట నిర్వివాదాంశము. ఆయన మొదలు పెట్టినవాట్లల్లో నాకు అసాధ్యంగా మొట్టమొదటనుంచిన్నీ తోcచింది యీ మద్యపాన నిషేధమే కాని నేను కూడా అప్పటినుంచి యిప్పటివరకున్నూ తాళ్లు కల్లుగీత కివ్వడంలేదు. దానివల్ల వచ్చే లాభాన్ని అంతో యింతో “వుడతాభక్తి స్మారకంగా వదలుకొన్నవాణ్ణి. పదివేలూ యిరవైవేలూ వదులుకున్నవారు వదులుకుంటూవుంటే నేనున్నూ వదులుకొనడాన్ని గూర్చి యిందులో తెల్పడం పరిహాసాస్పదంకాకపోదు - అయితే “ఢిల్లీకిఢిల్లే పల్లెకుపల్లె కదా? యీ వుద్యమం నెగ్గడం యేలాగ? అని సందేహమే కాని నెగ్గితే సంతోషించని ప్రాజ్ఞండంటూ వుండనే వుండండు. నేను కోరేదల్లా మద్యపానంతో పాటు నల్లమందుకూడా నిషేధిస్తే యెందటో