పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/100

ఈ పుట ఆమోదించబడ్డది

104

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

అంగోస్త్రంతోటిన్నీ అలాటిదే పైమీందితుండుగుడ్డతోటిన్నీ లండనులో అందులోనున్నూ వార్ధక్యంలో కాలక్షేపం చేయడమంటే మజాకాకాదు. ఆయన మన పురాణాల్లో పుట్టలు వగైరాలలోవుండి తపస్సుచేసిన ఏబుషులకూ తీసిపోయే వ్యక్తికాడు. ఆయన సంకల్పం లోకకల్యాణదాయకం అని చెప్పక తప్పదు. కాని కొంతకాలందాంకానేనా నల్లమందుమట్టుకు దొరకడం బాలవృద్ధాతురులకు అవసరం. సరే తాలూకా ఆఫీసులలో కాంబోలును దొరుకుతుందని వ్రాశారు. కొందఱయితే అక్కడికివెళ్లి తెచ్చుకోంగలరు. గాని కొందఱందుకున్నూ సామర్థ్యంలేనివాళ్లున్నారు. ఆ ఆఫీసుకు పూCట బత్యాలు కట్టుకుని వెళ్లలేరు. సరికాదా. ఏకంగా తులమూ అఱతులమూ కొనుక్కోవడానికి త్రాణలేనివాళ్లే చాలామంది. కాంగ్రెస్సు మంత్రులు ఆలాటిదీనులను ప్రత్యేకించి వక్కకంటితో చూడాలి. వాళ్లు మత్తుకోసం నల్లమందు అభ్యసించిన తెగలోవాళ్లు కారని యేప్రమాణంపడితే ఆ ప్రమాణంచేసిచెప్పవచ్చును. ఆలాటివాళ్లకు వుపకారంనిమిత్తం యీ మీంద నల్లమందు వెల చాలాసులభం అయేటట్టుకూడా చేస్తే యెందటో దీనులు ఆశీర్వదిస్తారు. అయితే కొందఱు “నల్లమందులాగే బ్రాందిన్నీ వ్యాధినివారకమే, అందుకోసమే మేమున్నూ అభ్యసించామనే వారున్నూవుంటారు. కాని అది నిజమా? కాదా? అని విచారణచేస్తే తేలకపోదు. మద్యపానం శుక్రునికాలన్నుంచిన్నీ నిషేధింపC బడుతూనేవుంది కాని నశించినట్టు మాత్రం లేదు. పంుంగా వృద్ధికూడా పొందిందేమో? జారత్వచోరత్వాదులకన్న దీనికి యొక్కువ గౌరవం మనవారు యివ్వరు. యూరపుఖండ వాసులు మితిమీటితే పానాన్ని మనతోపాటు చూస్తారే కాని మితిలోవుంటే దాని జోలికి పోరు. పూర్వకాలంలో నల్లమందుజోలికి ప్రభుత్వం వెళ్లినట్లాధారాలు కనపడవు. దాన్ని వ్యాధిగ్రస్తులు తప్ప యితరులు వాడినట్టు గ్రంథ దృష్టాంతాలున్నూ కనపడవు. వ్యాధిగ్రస్తుల విషయంలో మత్తు పదార్థాలకేకాదు; యే పదార్థాలకున్నూ విధినిషేధాలున్నట్టు యేమతంలోనూ కనపడదు. యింకా కొందఱు నిష్టాపరులు మన ఆర్యులలోనే వుల్లి వగయిరా నిషిద్ధవస్తువుల భక్షణానికి ప్రాణాపాయ సమయంలోకూడా సందేహించి మానుకున్నవారు కనపడతారు. యీ మత్తుపదార్థాలనుండి తప్పించడమనేమిషతో ప్రభుత్వంవారు ద్రవ్యార్జనచేసినట్టు పూర్వం కనపడదు. అందుకు ఆరంభించింది మహమ్మదీయ ప్రభుత్వం అని తోస్తుంది, “అబ్కారీ" అనేమాట వల్ల యిది తెలుస్తూవుంది. కాని ఆ ప్రభుత్వం నల్లమందు, గంజాయి వగయిరాలకు విశేషించి పన్ను విధించినట్టు కనపడదు. నా చిన్నతనంలోకూడా వీట్లకు పన్ను లేనట్టే యిప్పడుకూడా మన్యంలో వుండేవాళ్లకు కాంబోలును యీ పన్నులేదని చెప్పకుంటారు. పోనీ యీ పదార్థాలు మత్తుకలిగిస్తాయనే కారణంచేత పన్నువేశారను కుంటే? ఉప్ప చేసుకున్న పాపమేమిటి? బాగా ఆలోచించిచూస్తే ప్రతిమనిషిన్నీ అంతో