పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మల్కిభరామ్

45

“యరలవమదనస”యను కందపద్యములను దలలు మార్చి మల్కిభరాము ప్రభువున కన్వయించునట్లు చదివి పెద్దగా సమ్మానింపఁబడిరఁట.

క. కరయుగమును జరణంబులు
    నురము లలాటస్థలంబు నున్నతభుజముల్
    సరి ధరణి మోసి మ్రొక్కిరి
    మఱిమఱి నీశత్రులెల్ల మల్కిభరామా!
క. యరలవమదనస యనుచును
    బరుపడి నీయక్షరములు భయనయతతులన్
    నిరతమును వ్రాయనేర్చిరి
    మఱిమఱి నీపుత్త్రులెల్ల మల్కిభరామా!
ఉ. ఏడు కులాద్రు లెక్కి వెస నేడు పయోధులు దాఁటి లీలమై
    నేడవు దీవులం దిరిగి యేడుగడన్ విహరించి కీర్తి యీ
    రేడు జగమ్ములన్ వెలయ నేచిన మల్కిభరాముచంద్రుఁ డే
    యేడవచక్రవర్తి పదునేడవరాజు ధరాతలమ్మునన్.
ఉ. రాజును రాజుగాఁ డతఁడు రాహుముఖంబునఁ జిక్కె, వాహినీ
    రాజును రాజుగాఁ డతఁడు రామశరాహతిఁ దూలె, దేవతా
    రాజును రాజుగాఁ డతఁడు రావణసూతికి నోడె, నాజిలో
    రాజనరాజు మల్కి యిభరాముఁడె రాజు ధరాతలంబునన్.
ఉ. రాముఁడు దుక్కిముచ్చు, రఘురాముఁడు క్రోఁతులరాజు, రేణుకా
    రాముఁడు పోటుబంటు, పటురాగసమంచితుఁ డైనగోపికా
    రాముఁడు వెఱ్ఱిగొల్లఁ డిఁక రాష్ట్రములందు సమానులేరయా
    రాముల నెంచిచూడ నిభరామ మహీధవ భవ్యవైభవా.
చ. మలికిభరామభూప! మహిమండలరాజకులప్రదీప! నీ
    పలుకు శిలాక్షరం బితరపార్థివకోటులపల్కులన్నియున్