పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

చాటుపద్యమణిమంజరి

    ఏతప్పు నెన్నఁడు నెవ్వరు నెచ్చోటఁ
                    దలఁప రాకుండంగ నిలిపె నాజ్ఞ
    ఏడుదీవులయందు నెన్నూఱు హయమేధ
                    యాగంబు లొనరించె నలఘుమహిమ
గీ. అతులతరదీర్ఘసత్త్వసహస్రబాహు
    డహిగణాధిపఫణగణాయత్తభూరి
    భూభరముఁ దాల్చె నవలీలఁ బొగడఁ దగదె
    కార్తవీర్యార్జు నాహ్వయక్ష్మాతలేంద్రు?
సీ. ఒగిఁ జతుర్దశమహాయుగములు భువిఁ దాల్చె
                    సత్యవ్రతము హరిశ్చంద్రవిభుఁడు
    జంభారివరుణాదిసంభవితులలోన
                    దమయంతి వరియించెఁ దనర నలుఁడు
    ఆదిగర్భేశ్వరుం డై విప్రదాసుఁడై
                    చరియించెఁ బురుకుత్సజనవిభుండు
    బ్రాహ్మణహస్తంబు భండార మదియె కొ
                    ఠారంబుఁ జేసెఁ బురూరవుండు
గీ. సాగరము పేర్మి నిర్మించె సగరనృపతి
    కార్తవీర్యుండు మహి జైత్రవర్తనుండు
    వీరలార్గురుఁ దలపోయ విష్ణునిభులు
    చక్రవర్తులు నిత్యనిర్వక్రయశులు.

రణతిక్కన – నెల్లూరుపురము

విరాటపర్వముఁ దొట్టి తుదముట్ట నాంధ్రమహాభారతమును రచించిన తిక్కనసోమయాజి కీతఁడు పెద్దతండ్రికుమా