పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/161

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

చాటుపద్యమణిమంజరి

చ. అల ఘనచంద్రబింబసమ మై తనరారెడు వక్త్ర మందులోఁ
    గలిగిన నామభేదములకైవడి నొప్పెడిఁ గప్పుకొప్పు చె
    క్కులు రదనాంశుకంబు లవి గుబ్బలకున్ సరిరాకపోయెఁ జే
    తులు సరులయ్యె దానివలె నున్నది పొంకపుటారు బోఁటికిన్.
చ. దరభుజగైణసింహములఁ దద్గతవేణ్యవలోకనద్వయో
    దరముల కోడి వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం
    తరములఁ బూన నిక్కఁ దిన డాఁగ స్రవింపఁగ నూర్పులూర్ప స
    త్వరముగ నేఁగి నీడగని తత్తఱమందఁగ జేసి తౌ చెలీ!
మ. వరబింబాధరమున్ బయోధరములున్ వక్త్రాలకంబుల్ మనో
    హరలోలాక్షులుఁ జూప కవ్వలిమొగం బైనంత నేమాయె నీ
    గురుభాస్వజ్జఘనంబుఁ గ్రొమ్ముడియు మాకుం జాలవే! గంగ క
    ద్దరిమే లిద్దరికీడునుం గలవె యుద్యద్రాజబింబాననా!

కృష్ణదేవరాయలు

బళ్ళారిమండలములోని యానెగొందికి సమీపమున నుండిన విద్యానగర మనుపట్టణరాజము రాజధానిగా దక్షిణహిందూదేశమున కెల్ల నేకచ్ఛత్రాధిపత్యమును నిర్వహించిన యీనృపాలరత్నము క్రై.1509 మొదలు 1530 వఱకు రాజ్యము వహించినట్లు తెలియుచున్నది. కృష్ణరాయలు బహువారములు దండయాత్రలు చేసి నానారాజుల జయించి తురుష్కులముష్కరకృత్యముల సాగనీయక రాష్ట్రముల నాక్రమించుకొని మహారాజ్యవైభవ మనుభవించివాఁ డగుటయకాక సరసకవితావిలాసుఁడై పెద్దనాదిసుకవీంద్రుల పల్కుఁదేనియలఁ