పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/120

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కటికి కామన్నమంత్రి

109

పారిజాతాపహరణము కృతినందినప్పుడు కృష్ణరాయ లీతనికి రత్నకుండలముల నొసఁగెను. ఒకనాఁ డీకవి కుండలముల ధరించి తన యింటియరుఁగుపైఁ గూర్చుండియుండఁగా భట్టుకవి త్రోవ నరుగుచు నీకందపద్యముఁ జెప్పెను—

క. మాకొలఁది జానపదులకె
    నీకవనపుఠీవి యబ్బునే కూపనట
    ద్భేకములకు? గగనధునీ
    శీకరములచెమ్మ నందిసింగయతిమ్మా.

ఆనందించి తిమ్మకవి చేత నేమియు లేకపోవుటచేఁ గర్ణమున నున్న కుండల మొకటి తీసి యాతని కొసఁగెనఁట! తర్వాత రాయలయాస్థానమునకు నొంటికుండలముతోఁ దిమ్మకవియు భట్టుకవియు వచ్చిరఁట! ప్రస్తావవశమున నీవృత్తాంతము రాజు విని ‘గగన’యనుచో ‘నాక’యని మార్చి పద్యము మిసమిసలార్చెనట.

క. మాకొలఁది జానపదులకె
    నీకవనపుఠీవి యబ్బునే కూపనట
    ద్భేకములకు నాకధునీ
    శీకరములచెమ్మ! నందిసింగయతిమ్మా!

తిమ్మకవియు భట్టుమూర్తికవియు రెండుకుండలములను రాజునకు సమర్పించిరఁట! రాయలు వారిసరసతకు మెచ్చి హెచ్చు బహుమతు లిచ్చెనఁట!

కటికి కామన్నమంత్రి

క. తననుడివడి గలదినములు
    కని మనవలె నరుఁడు కటికికామనవలెనే