పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

చాటుపద్యరత్నాకరము

ప్రౌఢకవి మల్లన

ఈమల్లన బమ్మెరపోతనామాత్యుని కుమారుఁడగు ప్రౌఢకవిమల్లనయే. శ్రీనాథుఁడు తాను తెలిఁగించిన నైషధగ్రంథమును తన బావమఱఁదియగు పోతనకు వినిపించి. తన శక్తిని వెల్లడించి యాతనిచే మెప్పువడయు తలఁపుతో నొకనాఁడు బావమఱఁదియింటికిఁ బోయెనఁట. ఆసమయమునఁ బోతన గ్రామాంతరమున నుండెనఁట. ఇంటిలో మల్లనమాత్రముండెను. మల్లనకుఁ జిన్నతనము. శ్రీనాథుఁ డింటిలోనికిఁ బోయి తాను మోసుకొని వచ్చిన తాళపత్రగ్రంథమును శ్రద్ధతోఁ బదిలముగా నొకచోటఁ బెట్టుకొని కూర్చుండి, యల్లునివంకఁ జూచి ‘వరే, మీ నాయన యెక్కడికి వెళ్ళినాఁడురా” యని యడుగఁగాఁ బ్రస్తుతము గ్రామములో లేఁడనియు, మద్యాహ్నమున కింటికి వచ్చుననియు మల్లన ప్రత్యుత్తరముఁ జెప్పి మామగారిని కుశలప్రశ్న లడిగెను. శ్రీనాథుఁ డల్లునకుఁ జవాబులు చెప్పుచు గ్రంథమును విప్పి పారఁజూచుకొనుచుండెను. మల్లన దగ్గరకుఁ బోయి ‘మామా, అది యేమి గ్రంథ’మని యడిగెను. మామ నైషధమని బదులుచెప్పెను. అల్లుండు ‘శ్రీహర్షకృతమగుసంస్కతకావ్యమేనా’ యనఁగా, శ్రీనాథుఁడు ‘కాదు, కాదు. దానినే నేను తెలుఁగుజేసితి, దీనిపేరు శృంగారనైషధములే’యని గంభీరముగాఁ బల్కెను. మామగారి నాటలు పట్టింపవలయునని యెంచి మల్లన, ‘ఓహో, మామా, దీనిని నీవుకూడ తెలిఁగించితివా’ యనెను. ఆతఁ డట్లనఁగనే శ్రీనా