పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

జయములను, కవులను; పండితులను; వారివారి వివాదసామర్థ్యములను; మఱియు ననేకవిషయములను దెలిపి ప్రకృతదేశచరిత్రకారులకును, కవులకును జేయూఁత నొసగఁజాలియున్నవి.

ఇట్టిచాటువు లాంధ్రప్రపంచమున నెన్నియో జన్మించినవి. అం దొకకొన్ని తాళపత్రగ్రంథములఁ జేరి, రామబాణముల వాతఁబడి నశించినవి. ఇంకను నశించుచున్నవి. మఱికొన్ని తాళపత్రముల కెక్కక, కొందఱుముదుసళ్లనోటన నెలకొనియుండి నేటికి నామమాత్రావశిష్టము లైనవి. పోయినవి పోయినప్పటికి ననేకపద్యములు నిల్చి యున్నవి. కాని అవి యొకగ్రామమున నొకయింట నొకపొత్తమున లేమిని వానిని సంతరించుట మిగుల గష్టము. చాటుపద్యరత్నములఁ గూర్చిశ్రద్ధవహించినవారు లేకపోవుటచేత నవి యట్ల దిక్కుమాలి పడి యుండెను. మొన్న మొన్న బ్ర. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు కొన్ని చాటువులంగూర్చి— యీనవీనమహాకార్యమునకు మార్గదర్శకులయి— "చాటుపద్య మణిమంజరి" యను గ్రంథము నాంధ్రలోకమున కొసంగి వినుతిపాత్రులైరి. సామాన్యముగ లోకములో వాడుకలో నున్న చాటువులే కాక యెన్నియో పురాతనచాటువు లందున్నవి. అయిన నందుఁ