ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

చంపూరామాయణము


బురుహమదాళి యై జనకుపోకడ నేడ్పొదవ న్వచించుచు
న్భరతుఁడు మూర్ఛముంచె రఘునాయకు లక్ష్మణు జానకీసతిన్.

107


క.

ఆలో నంతఃపురజన, జాలోదితరోదనార్తి చదలంట నిడన్
వేలాతిగశోకార్ణవ, కోలాహల మావసిష్ఠకుంభజుఁ డణఁచెన్.

108


గీ.

తెలివి ఘటియిల్ల నంతటఁ గులగురూక్త, సరణి రఘువీరుఁ డామరసైంధవాప
కృతనివాపాదిసముచితకృత్య సముద, యుండగుచునుండె సుఖగోష్ఠి నుటజవాటి.

109


మ.

మనువంశంబునకున్ యశంబునకు ధర్మశ్రీకిఁ బ్రాక్పుణ్యవ
ర్తన కాచారబహుశ్రుతాదుల కనర్హం బెద్ది యాజాడ కొ
ప్పని తాత్పర్యము నిస్తరించు భరతోపజ్ఞంబు విజ్ఞాపనం
బు నిజారణ్యనివర్తనంబుఁ దెలుపన్ భూపుత్రిఱేఁ డత్తఱిన్.

110


మ.

సకృదుధ్యేతచిరేతరాంశునిభరాజ్యశ్రీమదావేశి చి
హ్నకిరీటంబు భరింప లే నమృతసౌఖ్యం బబ్బు నీరత్నపా
దుకల న్నాపయి నుంచు మంచు పదపాథోజంబుల న్వేఁడుపో
లిక నమ్రం బగు మౌళితోడి భరతున్ లేనవ్వుతోఁ జూచుచున్.

111


చ.

మనము గురూక్తి సత్యగరిమం దొరయింపమి రాజధర్మమే
యని యఖిలావని న్నిజపదావనియం దిడుకోర్కి దార్కొనం
బనిచిన మాండవీపతి సమస్తబలాన్వితుఁ డై యయోధ్యకుం
జని యచట న్వసింప కనుజన్ముఁడుఁ దాను జటాధురీణులై.

112


క.

ఎందాఁక రామువనగతి, యందాఁక వసింతు నిచట ననుపూనికతో
నందిగ్రామావసథము,నం దిగ్రామాభినంద్యనయుఁ డతఁ డుండెన్.

113


క.

దాశరథిజటాధరభయ, దాశరధిక్కృతి ఘటింప నంతట మర్యా
దాశరధియు భృతచాపమ, హాశరధియు నైన యనుజుఁ డతివయుఁ దానున్.

114


ఉ.

లేటికులంబు నోటఁ గబళించిన దర్భ త్యజించి సోగకన్
దేటల కల్వచాలు వనినిండ నిజాకృతిఁ గొంకు లేని స
య్యాటముతోఁ గనుంగొనెడు నత్రిమునీశ్వరు నాశ్రమక్షమా
వాటికి నేగి యాజటిలవర్యుసపర్య భజించె నయ్యెడన్.

115


గీ.

అత్రికనకగాత్రి యవనిపుత్రికినంగ, రాగ మొసఁగె సానురాగసరణి
దాన నొకటఁ బూనె జానకి మేనును, మించుమించు నాక్రమించు ఠీవి.

115