ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మర్యాదలను, యుద్ధరంగవిశేషములను, తత్తదాయుధవిశేషములను దెలుపు నీకావ్యమును మహాకావ్య మనుటయందు సంశయమేమున్నది?

యుద్ధపరికరములు:

1. చంద్రహాసము=ఒకవిధమగు ఖడ్గము (దీనితో సుచంద్రుఁడు కుముదుని పూర్వరూపమగు సింహముయొక్క తలను నఱికెను.)

2. నేజ=తోమరమను నాయుధవిశేషము. (పూమొగ్గనేజను మన్మథుఁడు వసంతముని వక్షస్థలమునఁ గుచ్చెను.)

3. బాగుదార=చూరకత్తి (దీనిచే మన్మథుఁడు వసంతమునిని నఱికెను.)

4. చిక్కటారు=మఱియొక విధమగు చూరకత్తి.

5. గుదియ=గద, పరశువు=గండ్రగొడ్డలి, వంకి=బాకు.

6. ద్రుఘణములు=ముద్గరములు, కుంతములు=బల్లెములు, పరిఘలు=పెద్ద ఖడ్గములు. (వీని నన్నిటిని తమిస్రాసుర యుద్ధమునఁ బేర్కొనెను. ఖడ్గాఖడ్గిలీలలు, శరాశరి యుజ్జృంభణములు, గదాగదివిలాసములు నా యుద్ధమునఁ జూపట్టెను. మరియు పరిఘ పట్టిస ముద్గర గదా భిందివాల తామర శూలాద్యాయుధములతో నా యుద్ధము జరిగెను. రథగజములు, గుఱ్ఱములు, కాలిబంటులు నిలుచు తీరులు, యుద్ధమునఁ బాల్గొనునప్పటి పద్ధతులు, బాణప్రయోగ ముల నేర్పులు మొదలయిన యుద్ధవిశేషముల నెన్నింటినో పేర్కొని తన రణవిద్యాకౌశలమును జూపెను.)

స్త్రీసంబోధనములు:

పారిజాతాపహరణకావ్యమునందు ముక్కు తిమ్మన్న శ్రీకృష్ణునిచేత సత్యభామను ‘ఓ లలితేంద్రనీలశకలోపమకైశిక!’ అని పిలిపించెను. ఆపిలుపు సందర్భమునకుఁ దగినట్లున్నది. దానినిఁ జూచి యితరకవులు, విశే