ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వాశ్రయ రూపజలదవ్రాతంబు దెసలకుం బాఱి చన నంబరాంతరంబున నిలువ నోపక దివిజరాజరాజధాని కారావ రుద్ధముదిరంబులఁ గదియం బఱచు శంపాలతావితానంబుల మేనులం గురియు తత్ప్రయాణ జంజన్య మాన స్వేదోదబిందు సందోహంబులయందంబున నక్షత్రమార్గాభియాయి నక్షత్రబాణగణ పాపట్యమాన గర్భస్థలీ సనీస్రస్యమాన పాండుజ్వలన గుళికాజాతంబులపైఁ జూపులు నిలుపుచు, నశేషజగజ్జనజేగీయమాన చిత్రసృజనాపారీణ లోహకారకౌశికవారంబు లపరిమితంబుగా నిజచమత్కారంబునం బుట్టింపఁ బట్టఁజాలమిం బగులు వేధోండభాండమండలంబువలన బలువడి వెడలి నలుదిక్కులకుఁ బఱచు నుజ్జ్వల జ్జ్యోతిర్జాతంబులతీరున బంభజ్యమాన ఘటబాణపటలంబుల నిర్గమించు నానాళిబాణంబులం గాంచి మెచ్చుచుఁ, గబరికావిన్యస్తచాంపేయప్రసవ చరీచర్యమాణ పరాగపాళికావలయంబులుం గమనీయ ధూమప్రరోహాంతరాంతర బనీభ్రశ్యమాన తనుతరానలకణాలికావలయంబులుం బరస్పరంబు సతీర్థ్య త్వంబునం జూపట్ట నుదారభ్రమణయంత్రంబుల గుండ్రవరుసలు దిరుగు తెఱగంటికంటితో నద్వైతవాదంబులు సేయు ననల్పశిల్పికరయష్టికాగ్ర బంభ్రమ్యమాణ చక్రబాణచక్రంబులఁ జూపున నాక్రమించుచుఁ, దమోరిపుత్రీయ మహామహోనివహంబులు తృణీకరించి నిరర్గళనీరంధ్రపట్టాతపవారణచ్ఛాయా కపటంబునఁ బుడమి నంతయు నాక్రమించు కటికచీఁకటి గని భయంబు పుట్టఁ బాతాళంబుఁ జొరఁబాఱి యనేక దేశాధినాయక చమూసహచరణన్యాసంబున నచ్చట నిలువలేక యవారితవారవాణ సాహోనినాద పాఫల్యమాన ధరాభాగంబున నొక్క మొత్తంబుగా గ్రక్కునం బైకి వెడలు తైజసత్ర్యణుకపరంపరల పెంపున భ్రాంతి వుట్టింప నిగుడు బిఱుసులమిణుంగురుల వీక్షించుచు, నిరతసురతతి వర్ణ్యమాన వితీర్ణిచాతురీపోపుష్యమాణంబు లగురారణ్యమాన మానితబిరుదశంఖధ్వానంబులఁ దనశుభంబు దెలిసి యది తిలకింప నేతెంచిన సత్కీర్తిప్రవాహంబు పోలికం బ్రకాశించు నహర్వర్తికామరీచిధట్టంబుల దృగ్ధామంబులం గట్టుచు, నిర్వేలసూర్యజ్యోతిఃప్రభావసద్యోంతర్హితుం డగుట నన్నెలమిన్నం గన్నులఁగానక తాతప్యమానాంతరంబున వియత్తలంబున