ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12]

ఏడవ ప్రకరణము

89


బెదరించుట, వారిని తొక్కి వినాశముచేయుట, కోటగోడలను దుర్గద్వారములను బురుజులను డీకొని పడద్రోయుట, ధనమును మోసికొని పోవుట; ఇందు దుర్గములను సాధించుట ముఖ్యతమము.

ఇట్లుపయోగ పడుచుండుటం జేసీ గజములనిన చక్రవర్తికి మహాప్రీతి. వాని సంరక్షణార్థము ఒక్కయధ్యక్షుఁడును, అనేకులు అధికారులును, లెక్కలేని క్షుద్రసేవకులును నియమింపఁబడి యుండిరి. వానికై గొప్పగొప్ప యడవులు విడదీసి యుంచియుండిరి. వాని కేమాత్రము నొప్పి కలుగఁజేసిన వారికిని శిక్షలు విధింపఁబడు చుండెను. గజశాలల కసవుచేర నిచ్చుటయు, ఏనుంగులకు ఆహారము పెట్టకపోవుటయు, వానికి పరుండ నేర్పఱచిన మెత్తని భూములలోఁ గాక ఇతరస్థలములలో వానిని పరుండనిచ్చుటయు, ఆయువుపట్టున వానినిగొట్టుటయు, వానిపై నితరుల నెక్కనిచ్చుటయు, సమయముగాని వేళల వాని నెక్కుటయు, ఇఱుకుసందులలోనుండి వానిని నీటి యొడ్డునకు నీళ్లు త్రాగించుటకుఁ గొని పోవుటయు, వానిని దట్టమగు నడవులలోనికిఁ బోనిచ్పుటయు నను నివి నేరములుగా నెంచఁబడి యట్టి యపరాధమునకుఁ గారకులైనవారు జరిమానాతో దండింపఁబడుచుండిరి. ఏనుఁగును చంపినవాఁడు ఉరిదీయఁ బడుచుండెను.1[1]

ఈ కాలమునందువలెనే ఆ కాలమునందును ఏనుఁగులు తమ్మును పెంచిన మావటివాండ్రయందు మిక్కిలి విశ్వాసము

  1. 1, చాణక్యుని అర్థశాస్త్రము 2 వ భాగము 32 ప్రకరణము