ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

చంద్రగుప్త చక్రవర్తి


పంజాబు చేశమునుండి గ్రీకువారిని వెడలఁగొట్టి నందున నీవార్త క్రీ.పూ. 322లో జరిగెనని చెప్పవచ్చును. సెల్యూకస్ తన ఏష్యవై భవమునకు బునాది నిర్మించుకొను చుండగా చంద్రగుప్తుఁడు హిందూదేశమునకు జక్రవర్తి యయ్యేనని జస్టిన్ వాసియున్నాఁడు.*[1] సెల్యూకస్ క్రీ. పూ. 321 లో బేబిలోన్ పట్టణమునకు క్షేత్రపుడుగా నియమింపఁబడెను. ఈ క్షేత్రపాధికారమే యతఁడు తరువాత రాజగుటకు మూలాధారము. అప్పటికి చంద్రఫుప్తుఁడు మగధా ధీశ్వరుఁడై యుండవలెను. కావున నంద సంహారము, పర్వతేశ్వర వథ, అమాత్య రాక్షసుని వశపఱచుకొనుట మొదలైన ముద్రారాక్షస వర్ణిత కథాంశము లన్నియు 321 లోనో తరువాత ఒకటి రెండు సంవత్సరములలోనో జరిగియుండవలెను. సెల్యూకసు 305 లోనో 304 లోనో చంద్రగుప్తుని మీదికి దండెత్తి వచ్చి 303 లోఁ బూర్తిగ పరాభూతుఁడై మగధేశ్వరునితో సంధిఁ జేసికొని వెళ్లి పోయెను. చంద్రగుప్తుఁ డిఱువదినాలుగు సంవత్సరములవఱకు రాజ్యముఁ జేసెనని వాయుభాగవతాది పురాణములలోను సింహళదేశపు చరిత్రలోను వ్రాసియుండుటఁ బట్టి అతఁడు 298 లోనో లేక 297 లోనో కీర్తి శేషుఁ డయ్యెనని మనము చెప్పవచ్చును. చంద్రగుప్తుఁ డలెగ్జాండరును చూచు వఱకు నిఱువదియై దేండ్ల వయస్సు గలవాఁడని యెంచితి మేని

  1. *" Sandrakottus having thus won the throne was reigning Over India when Seleucus was laying the foundations of his future greatness" (Justis)