ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

చంద్రగుప్త చక్రవర్తి


చున్నవి. మన చరిత్ర నాయకుఁడగు చంద్రగుప్తుఁడీ బిందుసారునితండ్రి. ఈతఁడిరువదినాలుగు సంవత్సరములు నేలయేలె నని పురాణములును సింహళ గ్రంథములును నుడువుచున్నవి. అనఁగా చంద్రగుప్తుఁడును బిందుసారుడును కలిసి 49 సంవత్సరములు రాజ్యమేలిరి. ఈ సంఖ్య 49 యిదివఱకు మనచే సాధింపబడిన 272లో ననఁగా అశోకుఁడు రాజ్యమునకు వచ్చిన సంఖ్యలోఁ గలుపగా 321 వచ్చుచున్నది. ఇదియే చంద్రగుప్తుఁడు రాజ్యమునకు వచ్చిన సంవత్సరపు సంఖ్య,

ఈలాగున మనము రెండు భిన్నమార్గముల బయలుదేరి వేఱు వేఱు నడకల నడచినను ఘట్టకుటీప్రభాత న్యాయమున నొక్కచోటికే వచ్చి చేరుచున్నాము. సాంద్రకోటస్ అనఁగా చంద్రగుప్తుడని యెంచి, అలెగ్జాండరుయొక్క దండయాత్ర తిథులును గ్రీకు చరిత్రకారులును నాధారముగాగై కొని వేసిన లెక్కలవలనను అశోకవర్ధనుని శాసనము నాధారము చేసికొని పురాణాదులలో వర్ణింపఁబడిన మౌర్యరాజుల పాలనాకాలము లెక్క వేసినను క్రీ. పూ. 321 లోనో, లేక 322 లోనో అతఁడు రాజ్యమునకు వచ్చినట్లు స్పష్టమగుచున్నది.

ఇదియుఁగాక వేరొక విశేషము గలదు. అశోకుఁడు క్రీ. పూ. 272 మొదలుకొని 231 వఱకు రాజ్యమేలెను. అతనిచే శాసనములోఁ బేర్కొనఁ బడిన ఆంటియోకుఁ డతనికి సమకాలికుఁడై 261 మొదలు 246 వఱకు రాజ్యమేలెను. చంద్రగుప్తుఁడు అశోకుని తాత, శల్యూకస్ నెకటాస్ అంటి