ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8]

అయిదవ ప్రకరణము

57

చరిత్రకారులందఱును నిస్సంశయముగా నొప్పుకొనినదే యయిసందున ఇచ్చట వివరణ మనవసరము.

అశోకునిచేఁ బ్రకటింపఁబడిన పదమూఁడవ శిలాశాసనమునందు నీ ప్రకారముగా వాయఁబడియున్నది.

పదమూఁడవ శిలాశాసనము.

సత్యజయము.

"పియదశి ముఖ్యతమముగ నెన్నెడి విజయము ధర్మ సందేశము వలననగు విజయమే. ఇట్టి విజయము పియదశి దన సామ్రాజ్యము నందేగాక దన కిరుగు పొరుగు సీమల యందలి ప్రజలందఱమీఁదను గూడ నొందియున్నాఁడు. ఆరువందల యోజనముల దూరముననుండు అంతియోక నామధేయుఁడగు యోనరాజు నివసించు ప్రదేశమునకు ఈ అంతియోకున కావల 'తురమాయె' 'అంతికిని' 'మక' 'అలికనుందర” అను నామములతోఁ బరగు రాజచతుష్టయము నివసించు ప్రదేశములకును ఈ విజయము వ్యాపించియున్నది."[1]

  1. Eshe cha mu (kha ) mute Vijayedevanam Priyasayo dhramavijayo; so cha puna ladho devanam priyasa iha cha sa (dre ) shu cha anteshu (8) ashashu pi Yojanasa (te) shu yatra Amtiyokonama Yona raja param cha teva Amtiyokena chature (4) rajani Turamaye nama Amtikini nama Makanama Alikasundaro nama. ( ఏ షేచా ముఖముతే విజయే దేవానాం ప్రియసయోధ్రమవిజయోసో చ పున లధో దేవానాం ప్రియస ఇహ చ వద్రేషుచ అంతేషు [8] అషషుపి యోజనా శ [తే] షు యాత్ర ఆంతియోకోనామ యోనరాజా పరాంచ తేవ అంతి యోకేనచతురే [4] రాజాని తురమాయే నామ అంతికిని నామ మకనామ అలిక సుందరో నామ.)