ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

చంద్రగుప్త చక్రవర్తి


గెడ్రోష్యా, అరకోష్యా, పరోపమిశదము, బాక్ట్రియానా, సాగ్డియానా క్రమముగ నుత్తరమున వ్యాపించి యుండెను. ఇందు గెడ్రోష్యా, అరకోష్యా, పరోపమిశదములు ఇక్కాలమున బెలూచిస్థానము, ఆప్గనిస్థానము లనఁబడుచున్నవి. బాక్ట్రియానా సాగ్డియానాలు ఇప్పట్ల బొకారా, సమరకండములనియుఁ భారతమున బాహ్లిక మనియు, ప్రకటములై యున్నవి. పరోపమిశద బాక్ట్రియానాలకు నడుమ హిందూకుశ పర్వతములును, బాక్ట్రియానా సాగ్డియానాలకు నడుమ ఉక్ష (Oxus) నదియును నున్నవి. సాగ్డియానా దేశమునకు దక్షిణమున ఉక్షనదియు ఉత్తరమున జాక్సార్టిసు నదియును పాఱుచున్నవి. అరకోష్యాకు పడమట డ్రాంగియానా, పరోపమిశదమునకు పడమట ఆర్యా, బాక్ట్రియాకు పడమట మార్గియానా దేశములు కలవు. గెడ్రోష్యాకు పడమట కార్మానియా, పెర్శిసు దేశములును వీనికుత్తరమున ఎడారియు దీనికుత్తరమున వరుసగ పార్థియ, హుర్కేనియాదేశములు వ్యాపించి కశ్యప (Caspian) సముద్రమును డాయుచున్నవి. పార్థియ, హుర్కేనియలకు పడమటను, కశ్యప సముద్రమునకు దక్షిణ పశ్చిమముల మధ్య దేశము ఉన్నది. మధ్యదేశమునకు దక్షిణమున సూసియానా సీమయున్నది. ఈ దేశములన్నియు గలిసి ఇప్పట్ల పెరిషియా (పారసీకము) అని పఱగుచున్నవి. ఇట్టి భూమికి పడమట టైగ్రిసునది ప్రవహించు చున్నది. టైగ్రిసునది మొదలు సింధునది వఱకును, పారశీక అరేబియాసముద్రములు మొదలు కాకసపర్యతము కాశ్యపసముద్రము జాక్సార్టిసునది వఱకును,