ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

చంద్రగుప్త చక్రవర్తి


మొదట రాజధాని మీదికి దండెత్తివచ్చి యోడిపోయిన చంద్రగుప్తునివలె రొట్టెను తింటివిగదా" యని వెక్కిరించెను. సమీప ప్రదేశమునందే మాఱువేషములతోనున్న చంద్రగుప్తు డా మాటలు విని మొదట సామంత రాజులను వశపఱుచు కొనుటకై యత్నము చేయసాగెను. ఒక బెస్తవానికి లంచమిచ్చి గంగానది ప్రవాహములో దాచి యుంచబడిన పంచనిధుల సంపాదించెను.

మాక్సు ముల్లరుగారి కథ

ఉత్తరవిహార సన్యాసుల కథలయందుండితీసి మాక్సు ముల్లరు గారు తమ సంస్కృత గ్రంథావళీ చరిత్రమునం దుదహరించున దేమనగ : తక్షశిలావాసియగు బ్రాహ్మణుండొకడు కలడు. అతనిపేరు చాణక్యుడు. పాటలీపుత్రమందుండ దటస్థించిన ఈ చాణక్యుడు ఏవిధముననో నందాగ్రహము నార్జించు కొనెను. అపుడు నందుడు భటులఁ బనిచి యతని బట్టుకొమ్మని యానతిచ్చెను. అంత చాణక్యుడు సమయస్ఫూర్తితోఁ దక్షణమె తన గట్టిన బట్టల సడలించి పారవైచి దిసమొలకాడై అజీవక వేషంబు గైకొని తప్పించుకొని పోయి నగరున విజనస్థలముగనున్న సంభారస్థానమునందు దాగియుండి కొంత తడవుమీద పర్వతరాజకుమార పరివారమును సంధించి వింధ్యంబుఁజేరె. వృషభరక్షితుడైన చంద్రగుప్తుడు అచ్చట పశువుల మేపుచుండెను. ఆ పిల్లవాని శుభలక్షణములఁ జూచి, పశువులకాపరికి ఒకవేయి కాహపణములఁ జెల్లించి చాణక్యుడు