ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

15


బడిరి. మురకు బుట్టినవాడు మౌర్యుడని పిలువబడెను. ఈ మౌర్యుడే చంద్రగుప్తు డనికొందఱును నీ మౌర్యుని పుత్రుడే చంద్రగుప్తు డని మఱి కొందఱు వ్రాసియున్నారు. మొదటి పురాణగాధ ననుసరింతము.

మహాపద్మనందుడు దుష్టస్వభావము గలవాడై ప్రజా పీడన మొనరించినందున నతడు ప్రజలకు నప్రియుడయ్యెను. ఇతడు కలికాంశుడనియు, శూద్ర ప్రాయుడనియు, అధార్మికుడనియు పురాణములు చెప్పుచున్నవి. విష్ణు, పురాణ వ్యాఖ్యానమునందీతడు ఏకచ్ఛత్రుడు, ఏకరాట్టు, లుబ్ధుడు, సర్వక్షత్రకర్త, పరశురామసద్రుశుడు అని వర్ణింపబడియున్నది.

గ్రీకువారి వ్రాతను జూచినను రాజగు నందునిపై ప్రజల కప్రీతియనియు అతడు లుబ్ధుడును విషయ లంపటుడును అనియు దెలియుచున్నది.

మఱియొక కధ చొప్పున నందునకు శకటాలుడను ప్రియమంత్రి గలడు. ఒకప్పుడు రాజునకు మంత్రిపై గోపము వచ్చి యాతడు మంత్రిని భూగృహములో ద్రోయించెను. అతనికి దేహయాత్ర మాత్రమున కవసరమగునంత ఆహారము పెట్టించు చుండెను. ఇట్లతడు ప్రాణావశేషుడై చెఱలో నుండగా పగతురు మగధము మీదికి దాడి వెడలివచ్చిరి. నందుడు శత్రులను భారదోలునట్టి యుపాయము గానక శకటాలుని చెఱనుండివిడిపించి యాతని మంత్రశక్తి మహిమచే శత్రువులను దిరస్కరింప గలిగెను. కాని తరువాత నాతఁడు